CM Revanth Reddy unveiled six guarantees application: ఆరు గ్యారెంటీ ల అభయాస్తం అప్లికేషన్ ఆవిష్కరించిన సీఎం

CM Revanth Reddy unveiled six guarantees application: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకానికి అందించనున్న ఆరు గ్యారెంటీ ల అభయాస్తం అప్లికేషన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Share the news
CM Revanth Reddy unveiled six guarantees application: ఆరు గ్యారెంటీ ల అభయాస్తం అప్లికేషన్ ఆవిష్కరించిన సీఎం

Six guarantees application ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ (Telangana) ప్రజలకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ మానిఫెస్టో లో ప్రకటించిన ప్రజా పాలనలో ఆరు గ్యారెంటీ ల అభయాస్త పథకాల పోస్టర్ ను, సంబంధించిన అప్లికేషన్ ను రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యంత్రి భట్టి విక్రమార్క, ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రేపటినుండి రాష్ట్రం లో ప్రజా సంక్షేమ పాలన కు శ్రీకారం చుడుతున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రేపటినుండి అంటే ఈ నెల 28నుండి నూతన సంవత్సరం జనవరి 6 వరకూ తమ గ్రామ పంచాయితీల్లో, మండల, తాలూకా, పట్టణ, నగర మున్సిపాల్టీల్లో ధరఖాస్తు చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ అభయ హస్తం పథకం లబ్ధి కోసం దరఖాస్తు చేసే వారు అప్లికేషన్ లో అడిగిన వివరాలను నమోదు చేసి తమ ఆధార కార్డు, రేషన కార్డు, ఫోటో ను జత పరచి రసీదు పొందగలరని సి ఎం రేవంత్ రెడ్డి ప్రజలు విజ్ఞప్తి చేశారు.

See also  CM Revanth greets Padma Vibhushan Chiranjeevi: చిరంజీవి విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

six guarantees application: దరఖాస్తు చేసుకోవాల్సిన పథకాలు

ఈ ప్రజా పాలనలో అమలు చేయనున్న ఆరు గ్యారెంటీలకు అర్హులైన లబ్ధి దారులు దరఖాస్తు చేసుకోవాల్సిన పథకాలు: మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు. తెలంగాణలో పాలానాధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైద్య ఖర్చులకు 10లక్షలు పెంపును ప్రారంభించారు.

రాష్ట్ర సచివాలయం లో ప్రజా పాలన లో భాగంగా అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తును ఆవిష్కరించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క. మంత్రులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీమతి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి మరియు ఇతర అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

-/ సురేష్ కశ్యప్
సీనియర్ జర్నలిస్ట్.

Also Read News

Scroll to Top