Effigy of RGV burnt: రాంగోపాల్ వర్మ దిష్టి బొమ్మను దహనం చేసిన TDP మహిళా విభాగం అధ్యక్షురాలు

Effigy of RGV burnt: తెలుగుదేశం పార్టీ పైనా, చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కల్యాణ్‌ పైనా బురద జల్లుతూ అవాస్తవాలు, అభూతకల్పనలు సృష్టించి ‘వ్యూహం’ పేరిట ఒక చెత్త సినిమాను నిర్మించి ప్రజల మీదకు వదిలారని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బుధవారం నాడు టీడీపీ అనుబంధ సంఘం తెలుగు మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి ఆధ్వర్యంలో రాంగోపాల్‌ వర్మ దిష్టి బొమ్మను దహనం చేశారు.
Share the news
Effigy of RGV burnt: రాంగోపాల్ వర్మ దిష్టి బొమ్మను దహనం చేసిన TDP మహిళా విభాగం అధ్యక్షురాలు

Effigy of RGV burnt

తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబు(Chandra Babu), లోకేష్‌(Lokesh), పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) పైనా బురద జల్లుతూ అవాస్తవాలు, అభూతకల్పనలు సృష్టించి రాంగోపాల్‌వర్మ (Ram Gopal Varma)చేత సైకో జగన్‌ ‘వ్యూహం’ (Vyuham)పేరిట ఒక చెత్త సినిమాను నిర్మించారని. రాంగోపాల్‌వర్మ ఒక సైకో, అతడిని మించిన మరో సైకో జగన్‌(Jagan). ఈ ఇద్దరు పిచ్చివాళ్లు కలిసి ఒక పిచ్చి కథను తయారు చేసి ప్రజల మీదకు వదిలారని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం తెలుగు మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి ఆధ్వర్యంలో రాంగోపాల్‌ వర్మ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయాలనుకుంటే జగన్‌ తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని రూ.43వేల కోట్లు అడ్డంగా ప్రజల నుంచి ఏవిధంగా దోచుకున్నాడనే అంశం మీద, కోడికత్తి డ్రామా పైనా, బాబాయ్‌ని దారుణంగా గొడ్డలితో నరికి చంపిన అంశంమీద, తాను చంపి అదే నేరాన్ని చంద్రబాబుపై నెట్టి ఊరూరా అబద్ధపు ప్రచారం చేసి ప్రజల సానుభూతి పొంది ఓట్లు సంపాదించిన విధానంపైనా వర్మ సినిమాలు తీయాల్సిందన్నారు.

See also  Muslim Community: ఓట్ల కోసం ముస్లిం సమాజాన్ని భయానికి గురి చేస్తున్న వైసీపీ అభ్యర్థి గణేష్ పై మండిపడ్డ MLA అనగాని!

జగన్‌ ఎన్నికలలో తన తల్లిని, చెల్లిని వాడుకొని అవసరం తీరిన తరువాత పార్టీ నుంచి మెడపెట్టి బయటకు గెంటివేసిన విధానంపైన సినిమాలు తీస్తే రక్తికట్టి ఉండేదన్నారు. ఈ దేశంలో రాజకీయ నాయకుల్లో కుట్రలు, కుతంత్రాలలో ఆరితేరినవాడు, అత్యంత అవినీతిపరుడు, నేరస్తుడు జగన్‌. కుట్రలు, కుతంత్రాలకు మారుపేరు జగన్‌ అయితే..వర్మ ఒక మానసిక వ్యాధిగ్రస్తుడు భారతీయ సాంప్రదాయాలపైన నమ్మకం లేదనీ. మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, ప్రేమలపైన నమ్మకం లేదనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడితో సినిమాలు తీయడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. అటువంటి వ్యక్తిని పిలిపించుకొని తాను ఓ గొప్ప దేశభక్తుడినని చూపించుకుంటూ సినిమా తీయించుకున్నాడు జగన్‌. ఇద్దరి పిచ్చివాళ్ల కలయికతో రూపొందిన ఈ పిచ్చి సినిమాను ప్రజలెవరూ చూడరని ప్రదర్శించిన థియేటర్లు నష్టాలు మూటగట్టుకోక తప్పదన్నారు..జగన్‌ దగ్గర కుప్పలుగా పడిఉన్న అవినీతి సొమ్ముతో ఇటువంటి పిచ్చి సినిమాలు తీసి ప్రజలపై వదులుతున్న జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి తీరుతారని షకీలా రెడ్డి అన్నారు.

See also  Gone Sensational Comments on Jagan: ఎన్నికల తరువాత జగన్ శాసనసభకు రాడంటూ గోనె వ్యాఖ్య

Effigy of RGV burnt: ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా నాయకులు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాళ్లు ప్రమీల, సూర్యదేవర ఝాన్సీ, కృష్ణ వేణి, ప్రధాన కార్యదర్శులు దాసరి మాల్యావతి, తాళికోట ఆశాబిందు, కార్యాలయ కార్యదర్శి ఉప్పల శాంతి, కార్యనిర్వహక కార్యదర్శి తగిరిశ లలిత, కార్యదర్శులు సురేఖ, సుధారాణి, మహిళా నాయకురాలు విజయలక్ష్మీ, సునీత తదితరులు పాల్గొన్నారు.

-/సురేష్ కశ్యప్
సీనియర్ జర్నలిస్ట్

Also Read News

Scroll to Top