
Alliance Road Shows జనంతో కిటకిట
టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) లు కూటమిగా ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇక కూటమి రోడ్డు షోలు(Alliance Road Shows) జనంతో కళకళ లాడుతున్నాయి. స్వచ్చందంగా జనం తరలి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) , పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అయితే సీఎం జగన్(YS Jagan Mohan Reddy) గారిని, ఆయన పరిపాలనను తూర్పారపడుతున్నారు. మండుటెండలకన్నా, వీళ్ళ విమర్శల వేడికి వైసీపీకి వడ(ఓట్ల) దెబ్బ తగిలేలా వుంది. ఇక నిన్న తెనాలిలో పవన్ సంధించిన ప్రశ్నలు ఓటర్లలో ఆలోచన రేకెత్తించేలా వున్నాయి.
“నీకు గులకరాయి తగిలితే ఈ రాష్ట్రానికి గాయమైనట్టా?..
30 వేల మంది మహిళలు, యువతులు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా?
ఆనాడు చంద్రబాబుపై రాళ్ల వర్షం..అప్పుడు కనీసం అయ్యో అనలేదే జగన్?
సరిగ్గా ఎన్నికలు వచ్చేప్పటికే జగన్‌కు గాయం ఎందుకు అవుతుంది?
ఎవరో ఒకరు చనిపోతారు. నాన్నా పులి సామెతలా ఆయన నాటకాలాడుతుంటే నేనే కాదు.. జనం కూడా నమ్మటం లేదు.” లాంటి సూటి ప్రశ్నలు సంధించిన పవన్ కళ్యాణ్.
ఇక బాబు గారు తన సుదీర్ఘ అనుభవం రంగరించి సభల్లో ప్రసంగిస్తున్నారు. మధ్యలో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ, పవన్ ప్రస్తావన తెస్తూ యువతను కూడా ఆకట్టుకుంటున్నారు.

జగన్ గారి రోడ్ షోలు జనం లేక కటకట

ఇక జగన్ బస్సు యాత్రకైతే జన స్పందన లేక వైసీపీ నేతలే కలవరపడుతున్నారు. నాలుగు రోడ్ల కూడలి ప్రాంతాల్లో కూడా కనీసం 100 మంది కూడా గుమికూడటం లేదు. మొన్న విజయవాడ రోడ్డు షోలో ట్రాఫిక్ ఆపేసి మరి జనం కనపడేలా చేశారు అంటున్నారు. ఇక గులక రాయి సంఘటన అయితే సానుభూతి సంగతి పక్కనపెడితే సోషల్ మిడిల్ ట్రోలర్లు చాకిరేవు పెట్టారు. గత అనుభవాల దృష్ట్యా తటస్తులు కూడా నమ్మడం లేదు అంటే ఇక చూసుకోండి. గుంటూరులో ముఖ్యమంత్రి పర్యటన చూసి ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ముఖ్యనేతలు తీవ్ర అసహనానికి గురి అవుతున్నారని అంటున్నారు.
దీనితో ఇప్పటి వరకు సర్వేలు చెప్పిన సీట్ల అంచనాలు తప్పు అవ్వవచ్చు. ఇప్పటి వరకు కూటమి 105+ సీట్ల తో అధికారం చేజిక్కించుకోవచ్చు అని సర్వేలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుత రోడ్డు షోల ట్రెండ్ చూస్తే వైసీపీ కి 20 నుంచి 30 సీట్లు రావడం కూడా కష్టమే అన్నట్లుంది మరి.