AP Politics: వచ్చే ఎన్నికల్లో రెండు కుటుంబాల మధ్యే పోటీ…

AP Politics: ఆంధ్రాలో రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు.. రెండు కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. వచ్చే ఎన్నికలు కూడా రెండు కుటుంబాల పోరాటంగా మారుతోంది.
Share the news
AP Politics: వచ్చే ఎన్నికల్లో రెండు కుటుంబాల మధ్యే పోటీ…

AP Politics లో రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు రెండు కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. వచ్చే ఎన్నికలు కూడా రెండు కుటుంబాల పోరాటంగా మారుతోంది….రెండు జాతీయ పార్టీలు..రెండు ప్రాంతీయ పార్టీల పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతిలోనే ఉండడం బహుశా ఏపీలో ఎన్నడూ చూడని రాజకీయ దృశ్యం. ..

AP Politics: రెండు కుటుంబాల మధ్యే పోటీ

వైసీపీ(YCP) – అన్న చేతిలోనే అధికారపార్టీ

ఏపీ రాజకీయాల్లో(AP Politics) చెరగని ముద్ర వేసిన YSR వారసుడిని నేనే అంటూ కాంగ్రెస్ హై కమాండ్ ను ధిక్కరించి మరీ సొంత పార్టీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏపీ సీఎం జగన్. 151 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని మెజార్టీ తో 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిపోయారు. ఇప్పుడు వై నాట్ 175 అంటూ మరోసారి ఏపీ లో పవర్ లోకి రావడానికి సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. బలమైన ప్రాంతీయ పార్టీకి ఆయన అధ్యక్షుడు .

See also  AP MP Candidates List: వచ్చే ఎన్నికల్లో ఏపీ లో పోటీ చేయబోతున్న పార్లమెంట్ అభ్యర్థులు వీళ్లే!

కాంగ్రెస్(Congress) – అన్నకి ఎదురొచ్చిన చెల్లి

YS షర్మిల.ప్రస్తుతం ఏపీ రాజకీయా(AP Politics)ల్లో ట్రెండింగ్ పేరు. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ లో చేరితే 10 రోజుల్లో నే ఏపీ అధ్యక్షురాలు అయిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోయ్యాలన్నా.. గత వైభవం దిశగా పార్టీని నడపాలన్నా అది షర్మిల వల్లే సాధ్యం అని కాంగ్రెస్ హై కమాండ్ నమ్ముతోంది. దానికి తోడు వైఎస్సార్ పై అభిమానం ఉండి.. జగన్ తో ఇమడ లేక పోతున్న వైసీపీ నాయకులకు పార్టీ నుండి బయటకు రావడానికి ఒక మార్గం గా షర్మిల కనిపిస్తున్నారు . దానితో మరో ఆలోచనకు తావు లేకుండా ఆమెకే పీసీసీ పగ్గాలు కట్టబెట్టారు హై కమాండ్ పెద్దలు. పైగా బలమైన రెడ్డి సామాజిక వర్గం ఆమెకు అదనపు బలం. ఆ వర్గం కాంగ్రెస్ ముందు నుండీ అండగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న షర్మిల తన కుమారుడి ఎంగేజ్మెంట్ అనంతరం ఏపీ లో అడుగుపెట్ట బోతున్నారు. ఆ తరువాత కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఆమె వర్గం అంచనా వేస్తోంది.

See also  Botsa Vs Ganta: టీడీపీ కొత్త ఎత్తుగడతో చీపురుపల్లి లో బొత్సా కు గంటా గండం!

టీడీపీ(TDP) – చంద్రన్న వ్యూహాల పైనే ఆశలు

పార్టీ పని అయిపోయింది అనుకున్న ప్రతీ సారీ టీడీపీ తిరిగి నిలదొక్కుకుంది అంటే అది నమ్మకమైన పసుపు సైనికులు, చంద్రబాబు రాజకీయ వ్యూహాల వల్లే అంటారు ఎనలిస్ట్ లు. 70ఏళ్ల పైబడ్డ వయస్సులో ఇప్పటికీ ఆయన పైనే తెలుగు తమ్ముళ్లు నమ్మకాలు పెట్టుకున్నారు. స్కిల్ స్కాం లో రిమాండ్ కు వెళ్లి వచ్చిన చంద్రబాబు ప్రజల్లో వచ్చిన సానుభూతిని ఓట్ల రూపంలో మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. కుమారుడు లోకేష్ ఒక ప్రక్క అండగా ఉండగా . ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోవైపు బలమైన. నమ్మకమైన తోడుగా ఉన్నారు. జనసేన ఫాక్టర్ ఈసారి ఎన్నికల ఫలితాల్ని శాసించబోతుంది.

బీజేపీ(BJP) – ఎన్టీఆర్ కుమాార్తె సామర్థ్యాలే శ్రీ రామ రక్ష

ఏపీలో ఎలాగైనా సొంతంగా బలపడాలన్న బీజీపీ ఆశలు ఎప్పుడూ దెబ్బ తింటూనే ఉన్నాయి . ఏరి కోరి తెచ్చుకున్న నాయకులు పార్టీ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగ పడకపోవడంతో పురందేశ్వరినే పార్టీ అధ్యక్షురాలు చేశారు కమలం పార్టీ పెద్దలు. దానికి తగ్గట్టుగానే రాష్ట్రం మొత్తం తిరుగుతూ బీజీపీనీ క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆమె. ఎన్టీఆర్ వారసత్వంతో పాటు స్వతహాగా అబ్బిన ప్రతిభా పాటవాలు ఆమె సొంతం . స్వయానా చంద్రబాబుకు వరసకు వదిన అయిన పురందేశ్వరి ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన ల మధ్య ఎన్నికల పొత్తు ఏర్పడితే కీలకపాత్ర పోషించబోతున్నారు .

See also  Leaders queuing up for Janasena: జనసేన లోకి క్యూ కడుతున్నYCP & ఇతర నాయుకులు!

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top