BJP TDP Janasena alliance

ఎట్టకేలకు బిజెపి టిడిపి జనసేన పొత్తు(BJP TDP Janasena alliance), సీట్ల ప్రకటన రాబోతుంది. నరేంద్ర మోడీ(Narendra Modi) అబుదాబి పర్యటన నుండి వచ్చిన తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోడీ తో సమావేశం అయ్యే అవకాశం. ఈనెల 17న బిజెపి, టిడిపి, జనసేన (BJP TDP Janasena alliance) సంబంధించిన సీట్లు సర్దుబాటు మరియు పొత్తుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల బోగట్టా.
BJP TDP Janasena alliance: పార్లమెంట్ స్థానాలు
ఇక బిజెపి టిడిపి జనసేన పొత్తులో భాగంగా టీడీపీ 17 నుంచి 20 పార్లమెంట్ స్థానాలు, భారతీయ జనతా పార్టీ 3 లేదా 4 , జనసేన 2 లేదా 3 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనసేనకు ఇంతకుముందు అనుకున్న విధంగానే కాకినాడ మచిలీపట్నం స్థానాలు కేటాయించడం జరుగుతుంది, మూడో సీట్ గురించి క్లారిటీ లేదు. భారతీయ జనతా పార్టీకి 6 పార్లమెంట్ స్థానాలు కోరినట్లు టాక్. అందులో భాగంగా రాజమండ్రి దగ్గుపాటి పురందేశ్వరి(OC) , అరకు వంగా గీత (ST), హిందూపురం సత్య కుమార్ యాదవ్ , రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కి మొత్తంగా 4 పార్లమెంటు సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అనివార్య కారణాలలో టిడిపి పై ఒత్తిడి వస్తే 5వ సీటు నరసాపురం నుంచి పోటీ చేసేందుకు రఘురామకృష్ణ రాజుకి అవకాశం కల్పించ వచ్చు.
విజయవాడ, ఏలూరు, గుంటూరు ఏదో ఒక స్థానంలో పోటీ చేయాలని సుజన చౌదరి కోరుకున్నా పొత్తులలో భాగంగా ఆ అవకాశం లేదు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో కేశినేని చిన్ని విస్తృతంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గుంటూరు ఇప్పటికే పెమ్మసానికి కేటాయించడం జరిగింది.. ఏలూరు గొర్రె ముచ్చు గోపాల్ యాదవ్ లేదా పుట్టా మహేష్ కి కేటాయించే అవకాశం. ఇక పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ వైజాగ్, గుంటూరు మరియు విజయవాడ సీట్లను వదులుకునే పరిస్థితుల్లో లేదు. అందులో భాగంగా వైజాగ్ నుంచి భరత్, గుంటూరు నుంచి పెమ్మసాని మరియు విజయవాడ నుంచి కేశినేని చిన్నికి తెలుగుదేశం పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది…
BJP TDP Janasena alliance: అసెంబ్లీ స్థానాలు
అలాగే కీలకమైన అసెంబ్లీ స్థానాల పంపకం విషయంలోనూ పార్టీల కసరత్తు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. పొత్తులో భాగంగా 28 స్థానాలు జనసేనకు 6 స్థానాలు బిజెపికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పొత్తులో భాగంగా బీజేపీ కైకలూరు, విశాఖ నార్త్, జమ్మలమడుగు అసెంబ్లీ లాంటి స్థానాలలో బిజెపి పోటీ చేసే అవకాశముందని తెలుస్తుంది.
మొదట జనసేన నుంచి మూడొంతుల సీట్లు డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ రాష్త్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా జనసేన తక్కువ స్థానాల్లో పోటీకి అంగీకరించి ఉండ వచ్చు. కానీ ఇక్కడే ఒక చిక్కు వుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దీనికి ఒప్పుకున్నా, జనసైనికులు ఎంతవరకు ఒప్పుకుంటారో చూడాలి. ఇది గౌరవమైన పొత్తు లా లేదని వారు భావిస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. అప్పుడు పొత్తు వున్నా కూడా పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ సరిగా జరుగుతుందో లేదో డౌటే. అలా అయితే దాని నుంచి వైసీపీ లాభ పడటం ఖాయం. అలా అని జనసేన ఎక్కువ సీట్లు తీసుకుని గెలవలేక పోయినా కూటమికి నష్టమే. సో మరీ తక్కువ ఇస్తే ఒకవిధమైన నష్టం, ఎక్కువ ఇస్తే ఇంకో విధమైన నష్టం. అందుకని రాష్త్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ, జనసేన మధ్య గౌరవప్రదమైన పొత్తు అనేలా సీట్ల పంపకం ఉండాలి.
కొసమెరుపు: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖమ్మం మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాలలో పోటీ చేసే అవకాశం. తెలంగాణా లో తమ గెలుపుకు సహకరించిన చంద్ర బాబు(Chandra Babu) కి రిటర్న్ గిఫ్ట్ గా రేవంత్ రెడ్డి ఈ రెండు స్థానాలను ఇస్తున్నాడా? వేచి చూడాలి..