Grand Alliance: ఖాయమైన బీజేపీ, టీడీపీ & జనసేన పొత్తు!.. బీజేపీ, జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్ళే!

Share the news
Grand Alliance: ఖాయమైన బీజేపీ, టీడీపీ & జనసేన పొత్తు!.. బీజేపీ, జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్ళే!

బీజేపీ, టీడీపీ & జనసేనల మహాకూటమి(Grand Alliance)

టీడీపీ(TDP) అంతర్గత చర్చలను బట్టి చూస్తే, పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. బీజేపీతో సీట్ల పంపకాల వ్యవహారంపై చంద్రబాబు ఎట్టకేలకు తెరదించారని సమాచారం. జనసేన(Janasena), బీజేపీతో(BJP) కలిసి తెలుగుదేశం పార్టీ మహాకూటమిని(Grand Alliance) ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైందని చెబుతున్నారు. ఇక ప్రకటనే అంటున్నారు. పొత్తు పైన 21న ప్రకటన వెలువడే అవకాశముంది. వీలైతే చంద్రబాబు(Chandra Babu), జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan), ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ఉమ్మడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, మహాకూటమిని ప్రకటిస్తారని చెబుతున్నారు.

సీట్ల షేరింగ్ ఇలా

పొత్తులో భాగంగా బీజేపీ 5 ఎంపీ సీట్లు & 8 లేదా 9 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఇక జనసేన 3 ఎంపీ సీట్లు & 25 లేదా 26 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ కంటే కూడా బీజేపీ అధికంగా లోక్‌సభ స్థానాలను కోరుకుంటోంది.

See also  Sammakka Sarakka Jatara: నిలువెత్తు బంగారం సమర్పణ, ప్రసాదం కోసం ఆఫ్ లైన్ & ఆన్ లైన్ సేవలు

ఇక బీజేపీ ఎంపీ సీట్లు అభ్యర్థుల విషయానికి వస్తే
పురంధేశ్వరి – రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి, రఘురామ కృష్ణంరాజు – నర్సాపురం, హాసిని – తిరుపతి, సత్యకుమార్ – హిందుపూర్, కొత్తపల్లి గీత – అరకు నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తుంది.

జనసేన ఎంపీ సీట్లు అభ్యర్థుల విషయానికి వస్తే
??? – కాకినాడ, బాలసౌరి – బందర్, నాగబాబు – అనకాపల్లి నుంచి పోటీ చేయనున్నారు. ఇకపోతే కాకినాడ అభ్యర్థి మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఒకటో రెండో మార్పులు తప్ప ఆల్మోస్ట్ ఈ జాబితానే ఫైనల్ అవవచ్చు.

ఇక ఇప్పటి వరకు వున్న సమాచారం ప్రకారం పెందుర్తి: పంచకర్ల రమేష్ బాబు, భీమిలి: వంశీకృష్ణ శ్రీనివాస్, గాజువాక: సుందరపు సతీష్, యలమంచిలి: సుందరపు విజయ్ కుమార్, పాయకరావుపేట: శివకుమారి, విశాఖ సౌత్: సాధిక్ జనసేన పార్టీ అభ్యర్థులుగా ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top