Farce of Letters: లేఖల ప్రహసనం.. మొన్న హరి రామజోగయ్య లేఖ.. ఇప్పుడు ముద్రగడ లేఖ!

Farce of Letters: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి ముద్రగడ లేఖాస్త్రం సంధించారు. హరి రామజోగయ్య ఇచ్చిన గ్యాప్ లో నేనూ ఉన్నానంటూ ఈయన ఒక లేఖాస్త్రం సంధించారు.
Share the news
Farce of Letters: లేఖల ప్రహసనం.. మొన్న హరి రామజోగయ్య లేఖ.. ఇప్పుడు ముద్రగడ లేఖ!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి ముద్రగడ మరో లేఖాస్త్రం సంధించారు. ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన ఆయన ఇప్పుడు మరోసారి విమర్శలు అందుకున్నారు. ఈ మధ్య జనసేనలో ముద్రగడ పద్మనాభం జాయిన్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన జాయిన్ అవ్వలేదు కానీ ఉచిత సలహాలు ఇవ్వడం మానలేదు.

Farce of Letters

అసలు ఈ లేఖల ప్రహసనం(Farce of Letters) ఏంటో ఎవరికీ అర్ధం కాదు. వీళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లేదా జనసేన(Janasena) శ్రేయోభిలాషులు అయితే ఇలా ఉచిత సలహాలు లేఖల రూపం లో రాసి సోషల్ మీడియా లో వదలరు. నాలుగు గోడల మధ్య జరిగే సమావేశాల్లో చర్చించాల్సిన విషయాల్ని ఇలా సోషల్ మీడియా లో వదిలారంటేనే వీళ్ళ ఉద్దేశ్యం స్పష్టం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. అయన నిర్ణయాల ప్రకారం పార్టీ నడుచుకుంటుంది, వీళ్ళ సలహాల బట్టి కాదు. కనీసం పార్టీ సభ్యులు కూడా కానటువంటి వీళ్ళు ఆయనకు లేఖలు రాయడమేంటి? సహజంగా మాజీలు ప్రజలకు మేలు చేయమని సీఎం కో లేదా పీఎం కో లేఖ రాశారు అంటే అర్థముంది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి పార్టీ అధ్యక్షుడికి రోజు లేఖలు రాసి, ఆయన చెవిలో జోరీగల్లా ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశ్యం అర్ధం చేసుకోలేనంత వెర్రి జనం ఎవరూ ఉండరు.

See also  BJP TDP Janasena Alliance: పొత్తు ద్వారా బాగా లబ్ది పొందిన బీజేపీ.. నష్టపోయిన జనసేన!

ఏదో సాటి కులపోడు పార్టీని సరిగా నడపలేక పోతున్నాడు సాయం చేయడానికి సలహాలు ఇస్తున్నారు అంటున్నారు కొందరు. అలాంటప్పుడు పార్టీలో చేరి పార్టీ అభివృద్ధికి కృషి చేయండి. అయన బొట్టు పట్టి పిలవలేదు అందుకనే పార్టీలో చేరడం లేదు అంటారు. దాని అర్ధం ఏమిటి? మీ అవసరం లేదని ఇండైరెక్ట్ గా అయన చెప్పినట్లేగా. మీరే అవసరం లేదన్నప్పుడు మీరెందుకు ఇంకా ఆయనకు సలహాలు ఇద్దాం అని ప్రయత్నిస్తున్నారు కనీసం మీకైనా అర్ధం అవుతుందా? ఎవరి ఆనందం కోసం? ఇక రోజు సోషల్ మీడియాలో కూడా వందలాది మంది ఆయనకు సలహాలు ఇస్తుంటారు పాపం. కనీసం వాళ్లకు లైకు లో, కామెంట్స్ వస్తాయి. లేఖలు రాసే వారికి ఏమొస్తుంది, పేపర్ ఖర్చు తప్ప.

ఇక పోతే లేఖల వీరులు పార్టీకి చేసే మరో నష్టమేంటంటే, పార్టీకి కాపు కుల ముద్ర వేయాడం. ఇండైరక్టు గా వేరే సామాజిక వర్గాలకి జనసేనను దూరం చేయడం వీళ్ళ హిడెన్ అజెండా అయి కూడా అయి ఉండవచ్చు. ఏ ప్రాంతీయ పార్టీకి అయినా అధ్యక్షుడిగా వున్న వ్యక్తి సామజిక వర్గం నుంచి బలమైన సపోర్ట్ అందుతుంది, ఇక్కడ అది రివర్స్ అవుతున్నట్లుంది. సో కాల్డ్ కుల కురు వృద్ధులమని చెప్పుకుని తిరిగే వాళ్ళ వల్ల కులానికి జరిగిన మేలేంటో ఎవరికీ తెలియదు. ఇక వీళ్ళ వల్ల జనసేనకు జరిగే మేలు ఏముంటుంది?

See also  GST Council meeting: జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు

అందుకే తాడేపల్లి గూడెం సభలో పవన్ మాట్లాడుతూ.. తనతో వచ్చే వాళ్లంతా పోరాడే వాళ్లు అయి ఉండాలే కానీ సలహాలు ఇచ్చే వాళ్లు వద్దే వద్దని తెగేసి చెప్పేశారు. ఒకసారి లేఖల వీరుల సలహాలు వద్దు అంటే.. దాని అర్ధం వద్దనే! ఇకనైనా ఈ లేఖల ప్రహసనం(Farce of Letters) ఆగుతుందిని ఆశిద్దాం.

Scroll to Top