Kapu Samkshema Sena Closed: తన సంక్షేమం చూసుకున్నాడు.. కాపు సంక్షేమ సేనను క్లోజ్ చేసాడు..

Share the news
Kapu Samkshema Sena Closed: తన సంక్షేమం చూసుకున్నాడు.. కాపు సంక్షేమ సేనను క్లోజ్ చేసాడు..

ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్నాక హరి రామజోగయ్య(Hari Ramajogaiah) కాపు సంక్షేమ సేన(Kapu Samkshema Sena) పేరుతో ఒక కుల సంఘం కొద్ది కాలంగా నడుపుతున్న సంగతి తెలిసిందే. కాపుల కోసమే దాన్ని ఆయన స్టార్ట్ చేసారు. కాపు సంక్షేమ సేనను ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాలలో గ్రామ స్థాయి దాకా తీసుకుని వెళ్ళి కమిటీలు సైతం వేశారు. ఇక పోతే అప్పుడప్పుడు జనసేనకు సలహాలు ఇస్తూ ఉండేవారు. ఏ హోదా లో ఇచ్చేవారో ఎవరికీ తెలియదు. ఇక ఈమధ్య టీడీపీ, జనసేన పొత్తులో సీట్ల సంఖ్య తేలిన తరువాత, ఆయన లేఖల ద్వారా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ని విమర్శించారు. దరిమిలా అయన కొడుకు సూర్యప్రకాష్ ను వైసీపీ లోకి పంపడంతో అయన నిజ స్వరూపం తెలిసిన జనసైనికులు జోగయ్య ను వైసీపీ కోవర్ట్ గా ముద్ర వేసేసారు. పవన్ కళ్యాణ్ కూడా మీ సలహాలు మాకు వద్దు అని గట్టిగా చెప్పారు.

See also  TS BJP: 6 MP స్థానాలకు బీజేపీ అభ్యర్థులు.. తెలంగాణా లో త్వరగా.. మరి ఆంధ్రా లో ఆలస్యమెందుకో?

Kapu Samkshema Sena Closed

ఇక అసలు విషయానికి వస్తే తాను ఇక మీదట రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించారు. ఇక మీదట రాజకీయాల్లో అసలు జోక్యం చేసుకోనని ఆయన చెప్పేశారు. ఇక కాపు సంక్షేమ సేన(Kapu Samkshema Sena) కూడా ఉండదు అని చెప్పేసి రద్దు చేసారు. అంతే కాదు తాను రాజకీయ విశ్లేషకుడిగా ఉంటాను అని ప్రకటించారు. అందుకే కుల సంఘ నాయుకులను నమ్మడం అంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు అంటారు. ఈ కుల సంగం నాయుకులు ఎల్లప్పుడూ వాళ్ళ పని అవగానే సంఘాన్ని పక్కన పెడతారు అనేది మరోసారి నిరూపితమయింది.

కొసమెరుపు: అంత బాగానే వుంది కానీ అయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకుని చాలా సంవత్సరాలు అయ్యింది. మరల ఇప్పుడు రాజకీయాలకు దూరంగా వుంటాను అని ప్రకటించడం ఎందుకో? ఏమో 3 లేదా 4 లేఖలు పవన్ కళ్యాణ్ కి రాస్తే రాజకీయాల్లో ఉన్నట్లేమో? ఇక అయన రాజకీయ విశ్లేషకుడు హోదాలో పవన్ కళ్యాణ్ కి లేఖలు రాస్తాడేమో?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top