NRI Letter to Pawan Kalyan: కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేసావ్.. అంటూ పవన్ కళ్యాణ్ రిప్లై

Share the news
NRI Letter

జనసేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్(Pawan Kalyan) త‌న సొంత పార్టీ విష‌యంలో ఎంతగా ఆలోచిస్తున్నారో అంతకంటే ఎక్కువగా ఆయ‌న అభిమాను అంచ‌నాలు పెట్టుకున్నారు. పార్టీని అభిమానించడం, ఆద‌రించ‌డ‌మే కాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం కోసం కూడా త‌పిస్తున్నారు. ఈ క్ర‌మంలో NRI జ‌న‌సేన(Janasena) సానుభూతి పరులు స్పందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్ర‌పంచ దేశాల్లో తెలుగు వారు ఉన్న ప్రతి దేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ నిల‌దొక్కుకోవాల‌ని చాలా బలంగా కోరుకుంటున్నారు.

తాజాగా ఐర్లాండ్‌(Irland)లో గ‌త 17 ఏళ్లుగా ఉంటున్న ఓ అభిమాని స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan)కు లేఖ(NRI Letter) రాశారు. తమ కష్టాలు చెప్పుకుంటూ తరువాత తమకు పార్టీ పైన వున్నా అభిమానాన్ని, ఆశలను వ్యక్తం చేసాడు. పార్టీని బ‌లోపేతం చేయాల‌ని కోరాడు. 2024లో బ‌లంగా క‌ల‌బ‌డాల‌ని ఆ అభిమాని పిలుపునిచ్చాడు. ఆ NRI Letter లో త‌న‌ను తాను.. ఓడ క‌ళాసీగా ప‌రిచ‌యం చేసుకున్న ఆ అభిమాని పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని న‌డిపించే నాయ‌కుడిగా అవ్వాలని కోరుకున్నాడు

See also  Mudragada takes off his Kapu mask: కాపు ముసుగు తీసేసి వైసీపీలోకి ముద్రగడ.. కాపు ఓట్ల చీలికే లక్ష్యం!

NRI Letter to Pawan Kalyan

లేఖ సారాంశం ఇదీ..

అన్నా..
క‌ష్టాలు, క‌న్నీళ్లు, రుణాలు దారుణాలు… కార‌ణాలుగా చూపిస్తూ.. నా దేశాన్ని వ‌దిలి విదేశాల్లో అవ‌మానాల్లో ఆనందాల‌ను వెతుక్కునే నాలాంటి వాళ్లెంద‌రికో.. ఒక్క‌టే నీమీద ఆశ‌! ఎక్క‌డో బ‌లీవియా అడ‌వుల్లో(Baliviya Forest) అంత‌మై పోయింద‌ని అనుకున్న విప్ల‌వానికి కొత్త రూపాన్ని ఒక‌టి క‌నిపెట్ట‌క‌పోతావా?

స‌రికొత్త గెరిల్లా వార్ ఫైర్‌(Gerilla war Fire)ని మొద‌లెట్ట‌క‌పోతావా? మ‌న దేశాన్ని.. క‌నీసం మ‌న రాష్ట్రాన్న‌యినా.. మార్చ‌క పోతావా?

17 ఏళ్లుగా ఈ దేశం(Country)లో లేక‌పోయినా.. ఈ దేశంపై ప్రేమ‌తో భార‌త పౌర‌స‌త్వాన్ని(Citizenship) వ‌దులుకోలేక‌.. ఎదురు చూస్తున్న నాలాంటివాళ్లంద‌రం.. మా కోసం నిల‌బ‌డుతున్న నీకోసం బ‌ల‌ప‌డ‌తాం.

2014 – నిల‌బ‌డ్డాం
2019 – బ‌ల‌ప‌డ్డాం
2024 -బ‌లంగా క‌ల‌బ‌డ‌దాం!

కారుమీద ఎక్కేట‌ప్పుడు జాగ్ర‌త్త అన్నా.. కారు కూత‌లు కూసేవారిని ప‌ట్టించుకోక‌న్నా.. కారుమ‌బ్బులు క‌మ్ముతున్నా… కార్యోన్ముఖుడివై వెళ్తున్న నీకు ఆ మ‌హాశ‌క్తి(Power full) అండ‌గా ఉంటుంద‌న్నా.. ప‌వ‌ర్ స్టార్‌(Power Star)వి నువ్వే క‌ద‌న్నా!! నువ్వు రాష్ట్రాన్ని ప్ర‌గ‌తి వైపు న‌డిపించే నాయ‌కుడివి. – ఐర్లాండ్ నుంచి ఒక ఓడ క‌ళాసి.

See also  Attempt to Split in the Kapu Community: పవన్‌ కల్యాణ్‌ పై వైసీపీ దాడి.. కాపుల్లో చీలికకు ప్రయత్నం!

రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఇంత అభిమానాన్ని.. ఇంత మంది అభిమానుల‌ను సంపాయించుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌రింత బాధ్య‌త పెరిగింద‌నే చెప్పాలి. కేవలం త‌న క‌ళ్ల ముందు క‌నిపించే ఏపీ ప్రజలే కాకుండా .. తెర‌చాటున కూడా త‌న‌ను అనుస‌రిస్తున్న‌వారు, గ‌మ‌నిస్తున్న‌వారు చాలా మందే ఉన్నార‌నేది ఓడ క‌ళాసీ రూపంలో బయట పడిందనే చెప్పాలి. అందుకేనేమో పవన్ ఎప్పుడు రాష్ట్ర, తెలుగు ప్రజల విశాల ప్రయోజనాల గురించి అలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఏదేమైనా.. ప‌వ‌న్‌కు మ‌రింత బాధ్య‌త పెరిగింద‌ని, ఇంకా చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు భావన.

NRI Letter కు పవన్ కళ్యాణ్ రిప్లై

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top