
SC Reserved Seats పై ఒక విశ్లేషణ..
ఆసక్తికరమైన విషయమేమిటంటే, డీలిమిటేషన్ నుండి గతంలో Andhra Pradesh లో జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ అత్యధికంగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలను(SC Reserved Seats) కైవసం చేసుకున్న పార్టీయే అధికారంలోకి వచ్చింది. 2009 కాంగ్రెస్, 2014 లో తెలుగు దేశం(TDP) మరియు 2019 ఎన్నికల్లో YCP మెజార్టీటీ SC Reserved Seats సాధించి అధికారంలోకి వచ్చాయి కూడా.
Party | 2009 లోSeats | 2014 లోseats | 2019 లో Seats |
Congress | 22 | 0 | 0 |
TDP | 7 | 16 | 1 |
YSRCP | – | 13 | 27 |
Janasena | – | – | 1 |
మరి 2024 లో SC Reserved Seats లో పరిస్థితి ఎలా ఉండబోతుంది?
ఒక ప్రముఖ సర్వే సంస్థ 30 మార్చి 2024 నుండి 3 ఏప్రిల్ 2024 వరకు ట్రాకర్ పోల్‌ను నిర్వహించింది. దీని కోసం ప్రతి ఎస్సీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజక వర్గానికి 5 పోలింగ్ స్టేషన్లు ఎంపిక చేయబడ్డాయి. ఇంకా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి క్రమబద్ధమైన రాండమ్ సాంపిల్స్ ను సేకరించారు. ఇవి కులం, మతం, మరియు వయస్సు పరంగా తీశారు. ఆడ, మగ వారికి సమాన ప్రాతినిధ్యం ఇచ్చారు.
ఈ సర్వే ప్రకారం తెలుగుదేశం నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (TDP, JSP & BJP) ఎస్సీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యర్థి అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పై స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం 175 సెగ్మెంట్లలో ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన 29 సెగ్మెంట్లలో టీడీపీ నేతృత్వంలోని కూటమి 51.81 శాతం ఓట్లతో 19 సీట్లు వస్తాయని అంచనా (మొత్తం 29లో). దాదాపు 42.83 శాతం ఓట్లను కలిగి ఉన్న YSRC మిగిలిన 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి, వైఎస్సార్‌సీపీకి మధ్య 8.98 శాతం ఓట్లు తేడా వుంది. 2019 లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన 27 సీట్ల తో పోల్చితే ఇది తీవ్ర తిరోగమనం.
SC Reserved Seats లో సర్వే ఫలితాలు – 2024
PARTY | Vote Share % | Seats |
YSRCP | 42.83% | 10 |
TDP+JSP+BJP | 51.81% | 19 |
Others | 5.36% | 0 |
Margin of error Plus or Minus 3 percent
ఇక ఈ నియోజక వర్గాల్లో కులాల పరంగా చూసుకుంటే. కమ్మ, కాపులు, BCలు, వైశ్య, క్షత్రియ కులాల్లో టీడీపీ + జనసేన + బీజేపీ పై గట్టి అభిమానం కన్పిస్తుంది ! బ్రాహ్మణ సామాజిక వర్గం సుమారు చెరి సగం. మాదిగ సామాజికవర్గం కూడా కూటమి వైపే మొగ్గు చూపుతుంది. అయితే రెడ్లు, క్రిస్టియన్లు మాత్రం వైస్సార్సీపీ వైపే (ఎక్కువ శాతం). ముస్లిమ్స్ కూడా వైసీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇక ఇతర అగ్ర, SC కులాల్లో కూడా కూటమి వైపే మొగ్గు కన్పిస్తుంది.