Political Alliances in AP: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వీడని పొత్తుల “పీఠ ముడి”.. బీజేపీ పొత్తు ఎవరితో..?!

Political Alliances in AP: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వీడని పొత్తుల "పీఠ ముడి".. బీజేపీ పొత్తు ఎవరితో…?! ఇష్టం వున్నా లేకపోయినా బీజేపీ తో పొత్తు పొత్తు పెట్టుకుని టీడీపీ, జనసేన కలసి 2014 సీన్ ను రిపీట్ చేయబోతున్నాయా.. సంక్రాంతి లోపు పొత్తుల పీఠ ముడి తేలనుందా ..
Share the news
Political Alliances in AP: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వీడని పొత్తుల “పీఠ ముడి”.. బీజేపీ పొత్తు ఎవరితో..?!

Political Alliances in AP పై చాలా రోజులుగా చర్చలు జరగడం చూస్తూనే వున్నాం. ముఖ్యంగా బీజేపీ, జనసేన & టీడీపీ పొత్తులో భాగస్వామి అవుతుందో లేదో అని రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న అంశం.

అధికార పార్టీ వైసీపీ ని చిత్తుగా ఓడించి జగన్ కి బుద్ది చెప్పాలని చూస్తున్న టిడిపి ఇప్పటికే జనసేన తో పొత్తు ఖరారు చేసింది. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసి , సీట్ల సర్దుపాటు పై ప్రకటన చేస్తారని సమాచారం. ఐతే JANASENA తో BJP కూడా పొత్తు కుదుర్చుకుంది. కానీ TDP కి BJP మధ్య ఇంకా సయోధ్య సందిగ్ధం లోనే ఉంది..కారణం తే.దే.పా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి 52 రోజుల పాటు జైల్లో పెట్టినప్పటికీ బీజేపీ నాయకులు, అధిష్టానం జోక్యం చేసుకోలేదు. కారణం తెలిసిందే AP CM Jagan Mohan Reddy బీజేపీ కు లోక్ సభ మరియు రాజ్యసభ లో అనుకూలంగా వ్యవహరించడమే. దానితో తెలుగు దేశం పార్టీ సభ్యులు బీజేపీ పై కోపంగానే ఉన్నారు. దీనితో Political Alliances in AP పీఠముడి పడినట్లయింది. అయితే జగన్ మోహన్ రెడ్డి ని ఓడించాలంటె ప్రతి పక్షాలన్నీ ఏకతాటి పైకి రావాలన్న చర్చ జరుగుతోంది.

See also  YCP అవినీతిపాలన అంతమే కూటమి లక్ష్యం -టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్!

అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్ర బాబు నాయుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా జాగ్రత్త గా ఆచి తూచి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అందరితో సంప్రదింపులు జరుపుతున్నారు. అందులో భాగమే మెన్న తెలంగాణ లో జరిగిన ఎన్నికల్లో ముందు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పినప్పటికీ చివరి క్షణాల్లో ఎక్కడా పోటీ చేయకుండా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం, Congress ను గెలిపించడానికి తెర వెనుక నుండి కృషి చేసిన సంగతి అందరికి తెలిసిందే. తద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్, తెలుగు దేశం మధ్య సయోధ్య పెంచడానికి ఇది సహకరిస్తుందని చేసిన ప్రయత్నం. అందులో బాబు చాణిక్యము ఫలించింది.

Political Alliances in AP: టీడీపీ, జనసేన పొత్తు పై క్లారిటీ

ఇక జనసేన ముందు నుంచి YCP ని ఓడించాలంటే, అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వమని గత కొద్ది నెలలుగా చెబుతూనే వస్తుంది. రాజమండ్రి జైలులో వున్న బాబు ను పరామర్శించడానికి వెళ్ళినపుడు పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు పైన క్లారిటీ ఇచ్చారు. అది కూడా లోకేష్ మరియు బాలకృష్ణ సమక్షంలో. దాని తరువాత ఆ రెండు పార్టీల సమన్వయ కమిటీలు ఏర్పడం, తరచు భేటీలు జరగడం తెలిసిందే. ఉభయ రాష్ట్రాల్లో జనసేనకు ఒక్క స్థానం లేక పోయినా అభిమాన బలం ఉన్న పవన్ అంటే అటు మోడీ కూడా ఎంతో ఇష్టపడతారు.. దానితో వాళ్లు రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఐతే ఇక్కడే తేట తెల్లం కానీ విషయం టిడిపి కాంగ్రెస్ ను కలుపు కోవాలా…?! లేక పోతే బీజేపీ తో జత కట్టాలా…?! నిన్ననే చంద్ర బాబు నాయుడు బెంగళూర్ విమానాశ్రయం లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కే.శివకుమార్ తో ముచ్చటించడం జరిగింది…!!! వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో…అన్నది “ఉష్ గప్ చిప్”?!

See also  Repalle Politics: వైసీపీ ఇంచార్జి మార్పుతో రసవత్తరంగా మారిన రేపల్లె రాజకీయం!

Political Alliances in AP: టీడీపీ కిం కర్తవ్యం

ఇక దేశంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ , బీజేపీ లు బద్ద శత్రువుల్లా ఉన్నారు…ఇలాంటి పరిణామాల్లో ఆంధ్ర ప్రదేశ్ లో బాబు తిరిగి పగ్గాలు పట్టి, జగన్ కి చెక్ పెట్టి, చుక్కలు చూపించాలంటే జనసేన తో పాటు ఈ రెండు జాతీయ పార్టీలలో ఎవరో ఒకరి తో ఒప్పందం కుదుర్చు కోక తప్పదు….అది కాంగ్రెస్సా…బి.జే.పి నా….?!! అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ కు గట్టి బలం లేదు, బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే …ఈ పరిస్థితుల్లో టీడీపీ కిం కర్తవ్యం ఏమిటి అన్నది.. పి.కే. (ప్రశాంత్ కిషోర్) ఏదో సలహా ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. ఇష్టం వున్నా లేకపోయినా బీజేపీ తో పొత్తు బెటర్ అనిపిస్తుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి, Center లో బీజేపీ లాంటి బలమైన పార్టీ సపోర్ట్ ఉంటే మంచిది. ఏది ఏమైనా Political Alliances in AP పీఠముడి సంక్రాంతి లోపు వీడనుంది.

See also  Rs 4000 Pension: కూటమిదే అధికారం…. అధికారంలోకి రాగానే అవ్వ తాతలకు రూ.4000 పింఛన్!

…చివరిగా కొస మెరుపు ఇప్పుడే అందిన ఓ సమాచారం ప్రకారం తెలుగు దేశం జనసేన కలయిక మంచి విజయం సాధిస్తుందని వీరికి తోడు బిజెపి ఐతే బాగుంటుందని ..అదే ఖరారు అవ్వనుందని బోగట్టా.. ..so let’s wait and see…. who are friends & who are enemies ..

@సురేష్ కశ్యప్

Also Read News

Scroll to Top