Political Biopics: NTR బయోపిక్ ల నిరాదరణ, టీడీపీ ఓటమి.. యాత్ర 2 నిరాదరణ, వైసీపీ ఓటమిని సూచిస్తుందా?

Share the news
Political Biopics: NTR బయోపిక్ ల నిరాదరణ, టీడీపీ ఓటమి.. యాత్ర 2 నిరాదరణ, వైసీపీ ఓటమిని సూచిస్తుందా?

Political Biopics ల నిరాదరణ ప్రజల రాజకీయ మూడ్ ని తెలుపుతుందా?

రాజకీయ బయోపిక్‌ల(Political Biopics)పై ప్రజల ఆసక్తిని బట్టి వాళ్ళ రాజకీయ మూడ్ ను అంచనా వేయవచ్చా? మామూలు టైం లో వచ్చే రాజకీయ బయోపిక్(Political Biopics) సినిమాలను పక్కనపెడితే, ఎన్నికల సమయం లో వచ్చే బయోపిక్ లు మాత్రం ప్రజల రాజకీయ మూడ్ ని బట్టే ఆడతాయి.

2019 లో వచ్చిన ఎన్టీఆర్ కధానాయకుడు , మహానాయకుడు సినిమాలే వాటికి ఉదాహరణ. టీడీపీ(TDP) మీద జనానికి వున్న వ్యతిరేకత ఆ సినెమాలపైన పడింది, ప్లాప్ అయ్యాయి, ఆ తరువాత టీడీపీ కూడా అధికారం కోల్పోవడం మనం చూసాం.

ఇక ప్రస్తుతానికి వస్తే యాత్ర 2 ఫిబ్రవరి 8 న థియేటర్లలో విడుదలైన సంగతి తెల్సిందే. రివ్యూస్ అన్ని నాణేనికి ఒక వైపే చూపించిన సినిమా అని 2+ రేటింగ్ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని హైలైట్ చేస్తూ, ప్రత్యర్థులపై బురద జల్లుతూ పూర్తి రాజకీయంగా సాగిన సినిమా అది. జగన్ జైలుకు వెళ్లినప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన జగన్ సోదరి షర్మిలను కూడా సినిమా నుంచి పూర్తిగా తప్పించారు.

See also  Nara Lokesh: నన్ను ఓడించేందుకు జగన్ రూ.300 కోట్లు పంపారు, మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్!

2019 ముందు ఎన్నికల ముందు ఎన్టీఆర్ కధానాయకుడు , మహానాయకుడు రెండు సినిమాలని ప్రజలు ఎలా తిరస్కరించారో ఇప్పుడు యాత్ర 2 ని కూడా అలానే తిరస్కరించినట్లు కనపడుతుంది కలెక్షన్స్ ను చూస్తే. ఇక పోతే యాత్ర 2 కూడా ఆ సినిమాల్లాగా ఎలక్షన్స్ ముందే వచ్చింది రిజల్ట్ కూడా సేమ్. ఇంటర్నల్ టాక్ ఏమిటంటే ఆ వచ్చిన కొంచెం కలెక్షన్స్ కూడా YCP నేతలు ప్రత్యేక షోలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత టిక్కెట్లు పంచడం ద్వారా వచ్చాయని.

ఇది ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి మద్దతుదారులు మరియు సాధారణ ప్రజల మానసిక స్థితికి అద్దం పడుతోంది అని చెప్పవచ్చా? కలెక్షన్స్ చూస్తే సినిమా చూసేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదని స్పష్టం అవుతుంది. సినిమా రెండవ రోజు కలెక్షన్స్ జస్ట్ 0.75 కోట్ల నెట్ మాత్రమే. సినిమా నిర్మాణ విలువలు బాగానే వున్నా ఆడక పోవడానికి కారణం ప్రజల రాజకీయ మూడ్ ఒక కారణం అయి ఉండవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top