Pothina Mahesh: జనసేనకు పోతిన మహేష్ రాజీనామా! త్వరలో వైసీపీలోకేనా?

ఎన్నికల వేళ జనసేనకు విజవాడ లో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత పోతిన మహేష్(Pothina Mahesh) సోమవారం జనసేనకు రాజీనామా చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు రాజీనామా లేఖను పంపించారు.
Share the news
Pothina Mahesh: జనసేనకు పోతిన మహేష్ రాజీనామా! త్వరలో వైసీపీలోకేనా?

జనసేనకు Pothina Mahesh రాజీనామా!

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన(Janasena) పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలక నేత పోతిన మహేష్ (Pothina Mahesh) సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు తన రాజీనామా లేఖను పంపించారు.

కాగా, విజయవాడ పశ్చిమ టిెకెట్ ను మహేష్(Pothina Mahesh) ఆశించాడు. అయితే, టీడీపీ(TDP) – బీజేపీ(BJP) – జనసేన పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ నేత సుజనా చౌదరికి కేటాయించారు. దీనితో మహేష్ తీవ్ర అసంతృప్తి కి లోనయ్యాడు. ఈ టికెట్ తనకే కేటాయించాలని పలు సందర్భాల్లో మహేష్ డిమాండ్ చేస్తూ వచ్చారు. తన అనుచరులతో కలిసి నిరసన, ఆందోళనలు నిర్వహించారు కూడా. అయితే, అధిష్టానం ఆయన డిమాండ్ నెరవేర్చకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేశారు.

See also  My First Vote for CBN కు విశేష స్పందన.. నూతన ఓటర్లలో ఉత్సాహం నింపిన అనగాని!

రాజీనామా తరువాత Pothina Mahesh చేసిన కొన్ని ఆరోపణలు

“6 నెలల్లో జనసేనని టీడీపీలో విలీనం చేసేస్తారు. గెలిచే స్థానాలు వదిలేసి ఓడిపోయే స్థానాలు తీసుకున్న మేధావి పవన్ కళ్యాణ్”
ఆ సంగతి ఐదు సంవత్సరాల పైగా పవన్ అనే మేధావి నడిపే పార్టీలో వుంటూ కూడా తెలుసుకోలేక పోయిన మేధావి పోతిన. టికెట్ రాకపోయేసరికి హఠాత్తుగా జ్ఞానోదయం అయినట్లుంది.

“తెనాలి సీటు ఎందుకు త్యాగం చేయలేదు ? కమ్మ వారు త్యాగాలు చేయరా ? బిసిలే చేయాలా ? పవన్ కళ్యాణ్ పెద్ద స్వార్థపరుడు, మాయగాడు. ప్రజలు తెలివైన వారు అందుకే రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించారు”
ఈ సంగతి తెలిసి కూడా ఇన్ని సంవత్సరాలు ఎందుకున్నావయ్యా జనసేన లో త్యాగమూర్తి పోతిన?

“పవన్ నన్ను రాజకీయంగా చంపేశాడు, ఇది నాకు పునర్జన్మ, ఏ పార్టీలో చేరతానో, ఏ జెండా మోస్తానో నా ఇష్టం. ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న వాళ్లంతా మూడు జెండాలు మోసిన వారే”
స్క్రిప్ట్ పేపర్ చూస్తూ మాట్లాడుతున్నప్పుడే తెలిసిపోయింది, నీవు వైసీపీ జెండా మోయబోతున్నావని పోతిన

See also  Tax on temples: కర్ణాటకలో దేవాలయాలపై 10% పన్ను.. బిల్ పాస్ చేసిన కాంగ్రెస్!

“25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అన్నారు, 25 రోజుల తరువాత అసలు జనసేన భవిష్యత్తు ఏంటి చెప్పగలవా పవన్ ? తీసుకున్న 21 లో కూడా 80% టీడీపీ వారికే టికెట్లు ఇచ్చావ్”
సరే రాజీనామా చేసావుగా, ఇక జనసేన భవిష్యత్ నీకెందుకు? అది ఉంటే ఎందుకు ఊడితే నీకెందుకు?

జనసేనలో కష్టపడ్డావు. కానీ పోటీ చేయడానికి అవకాశం రాలేదు. ఎవరికైనా భాదగా ఉంటుంది. కొంచెం ఓపిక పడితే అధికారంలోకి వచ్చిన తరువాత నీకు ఏదో ఒక పదవి వచ్చేది ఖచ్చితంగా. తొందరపడి రాజీనామా చేసావు. చేసావు పో, జనసేనలో అవకాశాలు రాలేదు వేరే పార్టీలోకి పోతున్నా అంటే ఎంత గౌరవంగా ఉండేది. అలా కాకుండా ఇంతలా విషం కక్కి పోవాలా? నీకు ముద్రగడకి తేడా ఏంటి ? పార్టీలో ఉన్నప్పుడు నాయకుడు రాముడు దేవుడు అంటారు. పోయేటప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడి పోతే ఏ జనం అయ్యా మిమ్మల్ని, మీ మాటల్ని నమ్మేది.

Scroll to Top