Repalle Politics: వైసీపీ ఇంచార్జి మార్పుతో రసవత్తరంగా మారిన రేపల్లె రాజకీయం!

Share the news
Repalle Politics: వైసీపీ ఇంచార్జి మార్పుతో రసవత్తరంగా మారిన రేపల్లె రాజకీయం!

సామాజిక సమీకరణతో గెలుపు సాధ్యమా…..?
నాయకత్వం అక్కర్లేదా…? వైసీపీ వ్యూహం కరెక్టేనా…?
రేపల్లె నియోజకవర్గ సీటుపై భిన్న వాదనలు
అధిష్టాన నిర్ణయాలతో జారిపోతున్న YCP పార్టీ కేడర్
రసకందాయం లో Repalle Politics

Repalle Politics: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ(YCP) అధిష్టాన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ శ్రేణులను అసహనానికి గురిచేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సారి ఎలాగైనా రేపల్లె(Repalle) సీటు గెలవాలనే లక్ష్యంతో వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో వైసీపీ శ్రేణులు పార్టీని వీడుతున్నారు. డాక్టర్ గణేష్ ను నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ గా ప్రకటించక ముందు వైసీపీ శ్రేణుల్లో ఉన్న జోష్ ఇప్పుడు ఎక్కడ కనిపించటం లేదు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎన్నికల ప్రచారాన్ని తలదన్నే రీతిలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ నిర్వహించారు. ఆ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటూ ప్రభుత్వానికి మరోసారి అండగా ఉండాలని ప్రజలను అభ్యర్ధిస్తూ సోషల్ మీడియా ద్వారా ఓటరులను ఆకర్శించే విధంగా పోస్టులు పెట్టారు. జగనన్న సురక్ష, ఆరోగ్య సురక్షా పేరుతో అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేశారు. అధికారమే లక్ష్యంగా ఎంపీ మోపిదేవి తనదైన శైలిలో వినూత్న కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లో తిరుగుతూ గెలుపై ధీమా వ్యక్తం చేశారు.

See also  Hari Ramajogaiah: తాడేపల్లిగూడెం సభలో తేలాల్సిందే.. లేదా తన కార్యాచరణ 29న ప్రకటిస్తా -జోగయ్య!

రసవత్తరంగా మారిన Repalle Politics!

ఈ తరుణంలో సామాజిక సమీకరణతో గెలుపు సాధ్యమంటూ వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మోపిదేవి(Mopidevi) అభిమానులను, పార్టీ శ్రేణులను కుదిపేసింది. డాక్టర్ ఈవూరి గణేష్ ను నియోజకవర్గ ఇంచార్జీ గా ప్రకటించారు. అప్పటి నుండి Repalle Politics రసవత్తరంగా మారాయి, మరోవైపు వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి మొదలైంది. కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండగా, మరికొందరు పార్టీని వీడుతున్నారు. సామాజిక సమీకరణలతో గెలుపుపై ప్రజల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలోని అన్ని సామాజికవర్గాల ప్రజలు వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.

ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్ని సామాజికవర్గాల్లో తమకంటూ కొంత స్థిరమైన ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకున్నారు. మంచి నాయకత్వ లక్షణాలతో పాటు సుదీర్గ రాజకీయ అనుభవంతో నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్లిన తమకంటూ ప్రత్యేక పార్టీ క్యాడర్ ను ఏర్పాటు చేసున్న నాయకులుగా గుర్తింపు పొందారు.

See also  Seat-Sharing Talks: చివరి దశకు చేరిన సీట్ల పంపకాల చర్చలు.. 10 ఎంపీల సీట్ల కోసం బీజేపీ బేరం..

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు సుమారు 2,22,481 మంది ఉన్నారు. అత్యధిక ఓట్లు కలిగివున్న సామాజిక వర్గాలలో మొదటి మూడు స్థానాలలో గౌడ సామాజికవర్గం, కాపు సామాజికవర్గం, ఎస్సీ సామాజిక వర్గం ఉన్నారు. అయితే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్, వైసీపీ ఇంచార్జీ డాక్టర్ గణేష్ ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కావటం గమనార్హం. గౌడ సామాజిక వర్గంలో ఓట్లు చీల్చితే వైసీపీ అభ్యర్థి గెలుపు కాయమని వైసీపీ పెద్దల వ్యూహంలో భాగంగా డాక్టర్ గణేష్ కు ఇంచార్జీ పదవి ఇచ్చారు.

నియోజకవర్గ ప్రజలు సామాజిక వర్గాల కన్నా నాయకత్వానికే ప్రాధాన్యత ఇచ్చారనేది గత ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. గౌడ సామాజిక వర్గంలో ఓట్లు చీలతాయి కానీ ఎంపీ మోపిదేవికి అండగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు, ఎస్ సి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు, మత్యకారులు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు మోపిదేవికి సీటు ఇవ్వకపోతే ఎమ్మెల్యే అనగాని(Anagani) నాయకత్వనికి మద్దత్తు తెలిపే అవకాశం లేకపోలేదని రాజకీయ మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

See also  YCP Changing Candidates? కడప ఎంపీతో పాటు మరి కొంతమంది వైసీపీ అభ్యర్థుల మార్పు? ఓటమి భయం వల్లేనా?

వైసీపీ అధిష్టానం సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి నాయకత్వన్ని అవమానిందనే ఆరోపణలున్నాయి. ఇంఛార్జీని మార్చారని ఇప్పటికి వైసీపీ పార్టీ శ్రేణుల మండిపడుతున్నారు. సామాజిక సమీకరణలతో గెలుస్తారా.. నాయకత్వం అక్కర్లేదా అని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ అసెంబ్లీ సీటు విషయంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ తప్పే అని బహిరంగంగానే చర్చిస్తున్నారు. బలమైన టీడీపీ(TDP) కంచుకోటలో వైసీపీ జెండా ఎగురవేయాలన్న, అనగాని సత్య ప్రసాద్ కు గట్టి పోటీ ఇవ్వాలన్న అది మోపిదేవి వెంకట రమణరావుకే సాధ్యమని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎంపీ మోపిదేవిని కాదని నియోజకవర్గ సీటు ఏ సామాజికవర్గానికి ఇచ్చినా రానున్న ఎన్నికల్లో వైసీపీ నియోజకవర్గంలో భారీమూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో Repalle Politics కి ప్రత్యేక స్థానం ఉండేది. రేపల్లె లో గెలిచిన పార్టీనే అధికారాం లోకి వచ్చేది. ఏది ఏమైనప్పటికి ఈసారి ఎన్నికలకు Repalle Politics రసవత్తరంగా ఉండబోతున్నాయి

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top