YCP Leaders: ఇంట్లో వాళ్ళ మద్దుతే లేని వైస్ జగన్ మరియు వైసీపీ నాయకులను ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారా?

Share the news
YCP Leaders: ఇంట్లో వాళ్ళ మద్దుతే లేని వైస్ జగన్ మరియు వైసీపీ నాయకులను ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారా?

ఇంట్లో వాళ్ళ మద్దుతు కోల్పోతున్న YCP Leaders!

తన చెల్లెళ్ల నుంచి రోజు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న జగన్(YS Jagan). ఇక కొంత మంది వైసీపీ నాయుకులు(YCP Leaders) కూడా వాళ్ళ వాళ్ళ ఫామిలీస్ నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఒకవైపు వైఎస్ షర్మిల(YS Sharmila) జగన్ పరిపాలన, పథకాలు. అయన మానసిక స్థితిపై రోజు సభల్లో ఎండకడుతుంటే మరోవైపు వైఎస్ సునీత తన తండ్రి హత్య గురించి జగన్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది.

ముద్రగడపై ఆమె కుమార్తె క్రాంతి ఫైర్!

ఇటీవలే ముద్రగడ(Mudragada)పై ఆమె కుమార్తె క్రాంతి ఫైర్ అయ్యారు. పేరు మార్పు ఛాలెంజ్‌, పదేపదే పవన్ కల్యాణ్‌ను తిట్టడంపై ముద్రగడ కుమార్తె క్రాంతి తప్పుపట్టారు. ఆయన్ని తిట్టడానికే ముద్రగడను వైసీపీ పార్టీలో జాయిన్ చేసుకున్నట్టు ఉందని ఆరోపించారు. పూర్తిగా దాని కోసమే వైసీపీ వాడుకుంటోందని ఫైర్ అయ్యారు. ఇంకా ఎన్నికల తర్వాత ముద్రగడ పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. మా నాన్న గారిని కేవలం పవన్ కల్యాణ్‌ను తిట్టడం కోసమే జగన్ మోహన్ రెడ్డి వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయన్ని ఎటూ కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. పవన్ కల్యాణ్ విజయం కోసం నా వంతు కృష్టి నేను చేస్తాను. ” అని క్రాంతి పేర్కొన్నారు.

See also  TDP-Janasena Satires on YCP Siddham: టీడీపీ-జనసేన కూటమి సిద్ధం విమర్శనాత్మక పోస్టర్ల ఆవిష్కరణ..

మా మామ నీచుడు అంటున్న అంబటి రాంబాబు అల్లుడు

అంబటి రాంబాబు(Ambati Rambabu) అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నా జీవితంలో చూడలేదు. రోజూ దేవుడికి దండం పెట్టుకొనేటప్పుడు ఇంతటి నీచుడ్ని ఇంకోసారి నా జీవితంలో ఇంట్రడ్యూస్ చేయకుస్వామి అని మొక్కుకుంటాను. అంత భయంకరమైన వ్యక్తి అంబటి అని అయన అల్లుడు డాక్టర్ గౌతమ్ వీడియోను విడుదల చేశారు.

ఒకప్పుడు వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకుల ఫ్యామిలీస్ మీద పడేవాళ్లు. ఇప్పుడు వైసీపీ నాయకులు(YCP Leaders), వాళ్ల ఫ్యామిలీస్ చేతే తిట్లు తింటున్నారు. కర్మ ఎవరిని విడిచిపెట్టదు అంటే ఇదేనేమో. ఇక ఇలా ఇంట్లో వాళ్లే వైసిపి నాయకులను తిడుతుంటే ప్రజలు ఏ నమ్మకంతో ఓట్లు వేస్తారు. అసలు వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top