Ambedkar Statue in Vijayawada: 19న 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ!

Ambedkar Statue in Vijayawada: ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహ విష్కరణ సీఎం చేతుల మీదుగా జరుగుతుందని విజయసాయి రెడ్డి చెప్పారు.
Share the news
Ambedkar Statue in Vijayawada: 19న 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ!

125 Feet Ambedkar Statue in Vijayawada

ఈ నెల 19న నిర్వహించే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనం ప్రారంభోత్సవ ఏర్పాట్లును వేగంగా చేస్తున్నారు. 125 అడుగుల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమం సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా జరగనున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను విజ‌య‌సాయిరెడ్డి స‌మీక్షించారు.

విజయవాడలోని స్వరాజ్య మైదానంలో కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ వి. విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట పాల్గొన్న సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సీఎం చేతుల మీదుగా జరుగుతుందని చెప్పారు. రూ.400 కోట్లకు పైన నిధులతో చరిత్రలో నిలిచేలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ నిర్మించారని తెలిపారు. అన్ని వర్గాలతో పాటుగా ఎస్సీలు కూడా సమానంగా అభివృద్ది చెందేలా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూశారని గుర్తు చేశారు.

See also  EC Notice: జగన్ మోహన్ రెడ్డిపై 'అవమానకరమైన' వ్యాఖ్యలు చేశారని చంద్రబాబుకు నోటీసు ఇచ్చిన ఎన్నికల సంఘం!

Ambedkar Statue in Vijayawada: విగ్రహావిష్కరణకి 80 వేల మంది

ఏలూరు, పల్నాడు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి సుమారు 80 వేల మందికి పైగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. వారి కోసం ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. బారికేడ్లతోపాటు కూడళ్లలో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top