
Actions on False Propaganda
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే ఉపేక్షించేది లేదు – ఏపీ పోలీస్
130 మంది పోలీసులతో సోషల్ మీడియా సెంటర్ ఏర్పాటు చేసిన ఏపీ పోలీస్. టీమ్ లో సాప్ట్ వేర్ స్పెషలిస్టులు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక టీమ్ ఉంటుంది.
రెచ్చగొట్టే ప్రకటనలు, సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేసే వారు, సోషల్ మీడియా నిందితులు అందరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రభుత్వ సహాయంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ, విజయవాడ లో ఒక సెంటర్ పెట్టడమే కాకుండా, ప్రతి జిల్లాలో హెడ్ క్వాటర్స్ లో ఒక CI, ఒక SI, 6 గురు కానిస్టేబుల్స్ తో ఆ జిల్లా ఎస్‌పి కి అనుసంధానం చేస్తూ, వారికి ల్యాప్టాప్ లు, డేస్క్ టాప్ లు ఇస్తూ డైరెక్ట్ గా మానిటరింగ్ చేస్తున్నాము.
ట్విట్టర్(Twitter) లోను, ఇన్ స్టాగ్రామ(Instagram) లోను, ఫేస్ బుక్ (Facebook) లో, వాట్సాప్(Whatsapp) గ్రూప్ లలో పెట్టే పోస్ట్ లను అబ్జర్వ్ చేస్తు వుంటామని తెలిపారు.
కనుక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు(Actions on False Propaganda) తప్పవు. కాబట్టి సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే వారు ఇకనైనా జాగ్రత్త పడాలి.