Actor Suman as YCP MP..? రాజమండ్రి YCP MP అభ్యర్థిగా నటుడు సుమన్!

Share the news
Actor Suman as YCP MP..? రాజమండ్రి YCP MP అభ్యర్థిగా నటుడు సుమన్!

Suman as YCP MP

ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రంగా ఉన్న రాజమండ్రి (Rajahmundry) నుంచి ఈసారి సుమన్‌ని దింపాలని గట్టిగానే కసరత్తు చేస్తోందట వైసీపీ. ఈ మేరకు పార్టీ పెద్దలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. గట్టి అభ్యర్థి కోసం వెదుకుతున్న సమయంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమన్‌ పేరు తెర మీదికి వచ్చిందట.

తెలుగు ప్రేక్షకులకు సుమన్‌గా పరిచితుడైన తల్వార్ సుమన్ గౌడ్‌… తెలుగు, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషల్లో కలిపి మొత్తం 700కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన స్వస్థలం మంగుళూరు. మాతృభాష తుళు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కరాటే సమాఖ్యకు అధ్యక్షుడు. ఇకపోతే రాజమండ్రిలో 25 ఏళ్ళ నుంచి నడుస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థకు గౌరవ సలహాదారుడిగా కూడా ఉన్నారు సుమన్. ఈ సంస్థ ద్వారా వృద్ధాశ్రమం, బధిరుల స్కూల్‌, అనాధలకు నిత్య అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

See also  Ambati Rayudu Playing AP T20? : పవన్ కల్యాణ్‌తో భేటీ.. జనసేన పార్టీలోకి అంబటి రాయుడు.!

Why Suman as YCP MP?

రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలో బీసీలే డిసైడింగ్ ఓటు ఫ్యాక్టర్‌. దీంతో సామాజిక సమీకరణలతో పాటు వ్యక్తిగత ఛరిష్మా ఉన్న సుమన్‌ని పోటీకి దింపితే ఎంపీ సీటుతో పాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో కూడా ప్రభావం ఉంటుందని నమ్ముతోందట వైసీపీ అధినాయకత్వం. ఇక గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమన్ MPగా పోటీ చేస్తే BC ఓట్లు గంపగుత్తగా పడే ఛాన్స్ ఉంటుందని YCP భావిస్తోంది. అందుకే ఆయన కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అన్నీ అనుకూలిస్తే… రాజమండ్రి వైసీపీ అభ్యర్థిగా సుమన్‌ ప్రకటించే అవకాశం ఉందన్నది పార్టీ వర్గాల టాక్‌. మరి తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

ఒకవేళ రాజమండ్రి YCP MP అభ్యర్థిగా సినీ నటుడు సుమన్ ఖాయమైతే, ఇంతకు ముందు ఇక్కడ MPగా పోటీచేసి గెలిచిన మార్గాని భరత్ రానున్న ఎన్నికల్లో MLAగా పోటీచేస్తారని తెలుస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top