![YCP అవినీతిపాలన అంతమే కూటమి లక్ష్యం -టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్!](https://samacharnow.in/wp-content/uploads/2024/03/YCP.webp)
YCP అవినీతిపాలన అంతమే కూటమి లక్ష్యం
Repalle: రాష్ట్రంలో ఉన్న YCP అరాచక, అవినీతి పాలనను తుదముట్టించేందుకు టిడిపి(TDP), జనసేన(Janasena), బిజేపి(BJP) కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్ధానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని రానున్న ఎన్నికల్లో వైసిపి పార్టీకి తగిన గుణపాఠం చెప్పి చరమగీతం పాడాలన్నారు.
ఈ నెల 17 ఆదివారం చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాగళం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu), జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం బిజేపితో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి సైకో పాలనపై యుద్ధం చేస్తున్నారని వివరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజేపి పార్టీలు బలపర్చిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, కూటమి సైనికులు నిరంతరం ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు.
కార్యక్రమంలో జనసేన నాయకులు మతి భాస్కరరావు, బిజెపి నాయకులు సాంబశివరావు, టిడిపి నాయకులు జీవి నాగేశ్వరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు
-By Guduru Ramesh Sr. Journalist