Gummanur Jayaram: ఉదయం వైసీపీకి రాజీనామా.. సాయంత్రం టీడీపీ లోకి.. ఎవరో కాదు మంత్రి గుమ్మానురు జయరామ్!

వైసీపీకి షాక్ ఇచ్చిన Gummanur Jayaram! గుమ్మనూరు జయరాం వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు నేడు విజవాడ లో ప్రకటించారు.
Share the news
Gummanur Jayaram: ఉదయం వైసీపీకి రాజీనామా.. సాయంత్రం టీడీపీ లోకి.. ఎవరో కాదు మంత్రి గుమ్మానురు జయరామ్!

మంత్రి, ఆలూరు MLA Gummanur Jayaram వైసీపీకి రాజీనామా

ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram) వైసీపీ(YCP) పార్టీకి, ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు నేడు విజవాడ మీడియా సమావేశంలో ప్రకటించారు. అంతకు ముందు Gummanur Jayaram సోదరులు భారీ కాన్వాయ్‌తో విజయవాడకు చేరుకున్నారు. సాయంత్రం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సమక్షంలో జయహో బీసీ సభలో టీడీపీ (TDP)లో చేరనున్నారు.

సీఎం జగన్ విధానాలతో విసుగు చెందానని గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram) అన్నారు. ఇంకా మాట్లాడుతూ “నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు పార్టీని వీడుతున్న. నాకు సహకారం అంద లేదు అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాను. 151 గడప ఉన్న చిన్న పల్లెటూరు నుంచి ఎమ్మెల్యే అయ్యాను. ప్రజల కష్టసుఖాలను చూసి ఈ స్థాయికి వచ్చా. నన్ను 2019లోనే కర్నూలు ఎంపిగా పోటీ చేయాలని చెప్పినా వద్దని ఎమ్మెల్యే గా పోటీ చేశా. ఇప్పుడు మరల కర్నూల్ ఎంపీ గా పోటీ చేయమని జగన్ అడిగారు. ఎంపిగా పోటీ చేయడం నాకు ఇష్తం లేదు అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నా. నా నియోజకవర్గం వదిలి వెళ్లాలని వైసీపీ చెప్పింది నాకు నచ్చలేదు. టీడీపీ అభ్యర్థిగా అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న. నాకు 2022 వరకు జీసస్, అల్లా యేసు అన్ని జగనే. ఇప్పుడు జగన్ ఒక శిలా విగ్రహలా మారారు మేము ఏమి చెప్పినా వినిపించడం లేదు. జగన్ అనే శిల్పానికి ఇద్దరు పూజారులు చెప్పేది వేదంలా ఉంది. సజ్జల రామ కృష్ణా రెడ్డి, దనునంజయ రెడ్డి ఇద్దరు కలిసి ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారు. నా నియోజకవర్గం ఆలూరు అభివృద్ధి చెందలేదు కానీ , నా పక్క నియోజకవర్గం డోన్ మాత్రం అభివృద్ధి చెందింది. నా నియోజకవర్గం పనులకు సంబంధించి బిల్స్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు”

See also  Prashant Kishor : ఏపీ ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమంటున్న ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్!

కొసమెరుపు: అంతా బాగానే వుంది, కానీ వైసీపీ పార్టీ నుంచి నాయుకులు, ఎమ్మెల్యే లు, ఎంపీలు రాజీనామా చేసి టీడీపీ మరియు జనసేన పార్టీల్లోకి చేరుతున్నారు. ఇదంతా ప్రజానాడి జగన్ అనుకూలంగా లేదు కాబట్టి, వైసీపీ మరల అధికారంలోకి కష్టం కాబట్టి, అధికారంలోకి వచ్చే కూటమిలోకి చేరడం సహజమే. జనసేన పార్టీకి పరవాలేదు కాని, టీడీపీ ఇంత మందిని ఎలా పార్టీలో ఇముడ్చుకోగలదు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాళ్ళని కాదని ఇలా చివరి నిముషంలో చేరిన వాళ్లకు ఎన్ని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇవ్వకలదు. వైసీపీ నుంచి వచ్చే వాళ్లంతా, అక్కడ టిక్కెట్లు నిరాకరించ బడినవాళ్ళే లేదా పార్టీ వేరే స్థానం నుంచి పోటీ చేయమంటే ఇష్టం లేక వచ్చినవాళ్లే. ఇంకా వాళ్ళందరి మీద సర్వే రిపోర్ట్స్ కూడా బాలేదని టిక్కెట్లు నిరాకరించారు లేదా స్థానాలను మార్చారు. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను తొలుస్తున్న పెద్ద భేతాళ ప్రశ్నఏమిటంటే అక్కడ రిపోర్ట్ సరిగా లేని వారు టీడీపీ నుంచి గెలవగలరా? ఇకపోతే టీడీపీ లో పాత కాపులు కొత్తగా వచ్చిన వారితో సరిగా సహకరించక పోతే మొదటికే మోసం వస్తుంది. భవిష్యత్తు లో ఏమి జరగనుందో త్వరలో జరిగే ఏపీ ఎన్నికల తెరమీద చూద్దాం.

See also  Mudragada takes off his Kapu mask: కాపు ముసుగు తీసేసి వైసీపీలోకి ముద్రగడ.. కాపు ఓట్ల చీలికే లక్ష్యం!

:

Also Read News

Scroll to Top