Ambati Rambabu dances again: అంబటి అదిరే స్టెప్పులు.. మంత్రి రాంబాబు సంక్రాంతి సంబరాలు..

Ambati Rambabu dances again: అంబటి అదిరే స్టెప్పులు.. గత ఏడాదిలా ఈ సంక్రాంతికి కూడా మంత్రి అంబటి రాంబాబు చక్కటి స్టెప్పులు వేసి అందరిని అలరించారు. ఈసారి స్టెప్పులు ఇంకా బాగా వున్నాయి.
Share the news
Ambati Rambabu dances again: అంబటి అదిరే స్టెప్పులు.. మంత్రి రాంబాబు సంక్రాంతి సంబరాలు..

Minister Ambati Rambabu dances again

రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) సంక్రాంతి పండుగ సంబరాలను మొదలుపెట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ(YCP) ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు భోగి సంబరాలు నిర్వహించారు. భోగి మంటల దగ్గర మంత్రి అంబటి వరుసగా ఈ ఏడాది కూడా డాన్సులు చేశారు. ఈసారి స్టెప్పులు ఇంకా బాగా కుదిరాయి. అంబటి రాంబాబు, సంబరాల రాంబాబు పాటకు కుర్రాళ్లతో కాలు కదిపాడు. బంజారా మహిళలతో కలిసి కూడా అంబటి రాంబాబు డాన్సులు చేశారు. గత ఏడాది సంక్రాంతి కూడా మంత్రి అంబటి రాంబాబు వేసిన స్టెప్పులు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పోయినసారి కన్నా అదిరే స్టెప్స్ తో అదే రీతిలో అంబటి రాంబాబు అందర్నీ అలరించారు. ఈసారి మ్యాడ్ సినిమాలోని ‘కళ్లజోడు కాలేజీ పాప సూడు..’ అనే పాటకు, ‘సంబరాల రాంబాబు’ పాటకు డాన్సు ఇరగ దీశారు.

See also  ఎన్నికలప్పుడు cVIGIL అని వింటుంటాం.. అసలు cVIGIL అంటే ఏమిటి? దేనికోసం.. ఎలా ఉపయోగించాలి?

కొసమెరుపు
పోయిన సారి అంబటి రాంబాబు స్టెప్పులను బ్రో సినిమాలో పేరడీ చేసిన సంగతి తెల్సిందే. ఈసారి ఎవరు పేరడీ చేస్తారో చూద్దాం. ఏమైనప్పటికి అంబటి టాలెంట్ ను మెచ్చుకోవాల్సిందే.

Also Read News

Scroll to Top