Ambati Rayudu Playing AP T20? : పవన్ కల్యాణ్‌తో భేటీ.. జనసేన పార్టీలోకి అంబటి రాయుడు.!

Ambati Rayudu : మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Amabti Rayudu) జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సమావేశం అయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఈ సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.
Share the news
Ambati Rayudu Playing AP T20? : పవన్ కల్యాణ్‌తో భేటీ.. జనసేన పార్టీలోకి అంబటి రాయుడు.!

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Amabti Rayudu) జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)తో సమావేశం అయ్యారు. జనసేన(Janasena) పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేయాలని కోరికతోనే Ambati Rayudu వైసీపీ(YCP) లో చేరారు అని వినికిడి. టికెట్‌పై వైసీపీ క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. T 20 లు ఆడి ఆడి త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి అలవాటు పడినట్లున్నాడు. దాంతో వెంటనే వైసీపీ కి రాజీనామా చేసాడు, ఇప్పడు పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యాడు.

వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన తరువాత క్రికెట్ ఆడటం కోసం రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ట్వీట్ చేశారు. త్వరలో దుబాయ్‌లో జరుగబోతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఆడనున్నట్లు వెల్లడించారు. అందుకే వైసీపీ రాజీనామా చేసినట్లు Ambati Rayudu చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు జనసేనలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తాడా లేదా పార్టీ ప్రచారంలో మాత్రమే పాల్గొంటాడా అనేది ఇంకా క్లారిటీ లేదు.

See also  MLA Anagani: అభివృద్ది, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం… రేపల్లె ఎమ్మెల్యే అనగాని!

రిటైర్మెంట్ ప్రకటించడానికంటే ముందు నుంచి వైసీపీతో టచ్‌లో Ambati Rayudu !

రిటైర్మెంట్ ప్రకటించడానికంటే ముందు నుంచి అంబటి రాయుడు వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారు. ఆయన ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించిన ఇండియా సిమెంట్స్ ఓనర్ శ్రీనివాసన్‌తో సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాల కారణంగా రాయుడు వైసీపీ వైపు మొగ్గు చూపి ఉండవచ్చు. అప్పట్లో ఆయనకు గుంటూరు ఎంపీ స్థానం ఇస్తారని .. అందుకే పార్టీలో చేర్చుకున్నారని ప్రచారం జరిగింది. వైసీపీ పార్టీ గుంటూరు ఎంపీ సీట్ పై క్లారిటీ ఇవ్వక పోవడం ఆయన రాజీనామాకు ఒక కారణం అయితే .. క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తో టీడీపీ జనసేన కూటమికి విజయావకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్లుగా కూడా భావిస్తున్నారు.

Also Read: Ambati Rayudu : పార్టీలో చేరిన 10 రోజులకే రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చిన అంబటి రాయుడు

Ambati Rayudu జనసేనలో చేరితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?

పవన్ తో అంబటి రాయుడు సమావేశం వివరాలు పూర్తిగా వెల్లడయిన తర్వాత మాత్రమే అంబటి రాయుడు రాజకీయ భవిష్యత్ పై తీసుకునే నిర్ణయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ జనసేన లో చేరేటట్లైతే గుంటూరు కానీ మచిలీపట్టణం నుంచి కానీ ఎంపీ గా పోటీ చేయవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఆయన స్వస్థలం పొన్నూరు అయినప్పటికీ.. తాతల కాలంలోనే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కనుక ఏ సీట్ అయినా ఒకటే ఆయనకు.

See also  Arava Sridhar: రైల్వేకోడూర్‌ జనసేన అభ్యర్థి గా అరవ శ్రీధర్

వైసీపీ లో చేరకు ముందే గ్రౌండ్ లెవెల్ తిరిగి ప్రజలు పల్స్ తెలుసుకుంటే బావుండేది. ఇప్పటికైనా మించి పోయిందేమి లేదు. T 20 లు ఆడినట్లు గా కాకుండా టెస్ట్ మ్యాచ్ ల్లా, నిదానంగా అలోచించి నిర్ణయాలు తీసుకుంటే జనసేన లో Ambati Rayudu కు మంచి భవిష్యత్తు ఉండవచ్చు.

Also Read News

Scroll to Top