Anagani Election Campaign: పేటేరు నుంచి అట్టహాసంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనగాని

Share the news
Anagani Election Campaign: పేటేరు నుంచి అట్టహాసంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనగాని

అట్టహాసంగా మొదలైన Anagani Election Campaign

రేపల్లె(Repalle): నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన ,బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad) సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని(Anagani Election Campaign) మండలంలోని పేటేరులో అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా శ్రీ బుర్గలమ్మ అమ్మవారి ఆలయంలో, బావాజీ తోట వద్ద గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

డప్పు వాయిద్యాలు, కళాకారుల ప్రదర్శనలతో పేటేరు(Peteru) ప్రధాన రహదారి నుండి ఉత్సావంలా ఎన్నికల ప్రచారం(Anagani Election Campaign) సాగింది. డీజే ధ్వనులు కళాకారుల విన్యాసాలు, జూనియర్ బాలయ్య వేషధారణలోని వ్యక్తి ఆకట్టుకునే విధంగా ప్రజలకు అభివాదాలు, ప్రత్యేక వాహనాలలో ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా రేపల్లె అభివృద్ధి పై డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. గ్రామంలోని మహిళలు హారతులు ఇస్తూ అనగానికి బ్రహ్మరథం పట్టారు. డెల్టా టైగర్ అని, హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని, అనగానితోనే అభివృద్ధి అని, గెలుపు ఖాయం చంద్రన్న సీఎం, కాబోయే మంత్రి అనగాని అంటూ నినాదాలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు.

See also  NTR Death Anniversary in Nimmakuru: నిమ్మకూరు లో NTR వర్థంతి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు

పేటేరులో తెలుగుదేశం పార్టీ(TDP) కార్యాలయాన్ని ప్రారంభించిన అనగాని, అంకమ్మ చెట్టు వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ 2014 ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది, 2019 ఎన్నికల తర్వాత రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. ఓటు వేసే ముందు జాగ్రత్తగా పరిశీలించి వేయాలన్నారు. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన రాక్షసుడు రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు అభివృద్ధిని వెనక్కి తీసుకువెళ్లాడని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి అన్నారు. రాక్షసుడుని గద్దె దించాలి కూటమిని గెలిపించాలంటూ అభ్యర్థించారు.

విజనరీ కలిగిన గొప్ప నేత చంద్రబాబు(Chandra Babu) నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో పునర్ వైభవాన్ని తీసుకువస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం, జనసేన(Janasena), బిజెపి(BJP) కూటమిని గెలిపించాలని కోరారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలన అందించారని గుర్తు చేశారు. అబద్ధపు పునాదులపై వైసీపీ పార్టీ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో ముంచిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు.

See also  Ongole MP Seat: ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మంత్రి రోజా పోటీ!

2014లో తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఈ ప్రాంతాన్ని ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు, కూటమి గెలుపు ఖాయమని అన్నారు. రాష్ట్రంలోనే రేపల్లె నియోజకవర్గంన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో దొంగల పాలన, దోపిడి పాలన నడుస్తుందని అన్నారు. దోపిడీ పాలనను అంతమొందించి అవినీతిని సామ్రాజ్యాన్ని పునాదులతో సహా పెకిలించి వేసేందుకు రాష్ట్ర ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు. నియోజకవర్గంలో శాసనసభ్యులుగా తనని బాపట్ల పార్లమెంటు సభ్యులైన కృష్ణ ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top