Another Shock to YS Jagan? జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబుతుందా??

Share the news
Another Shock to YS Jagan? జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబుతుందా??

ఏపీ సీఎం YS Jagan కు సొంత చెల్లి ఇచ్చిన షాక్ నుంచి తేరుకోక ముందే మరో చెల్లెలు షాక్ ఇవ్వబోయేలా వుంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెట్ట బోతున్నారు.

ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారని తెలుస్తుంది. షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఏపీలో చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయితే ఏపీ రాజకీయల్లో అది ఒక సంచలనం అవుతుంది.

YS Jagan కు షాక్ తప్పదా!

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత ఆమె కుమార్తె సునీతా రెడ్డి యాక్టివ్ ఐన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కీలకమైన సమాచారం ఇచ్చారు కూడా. అంతేకాదు.. కోర్టుల్లో కేసుల్లో కూడా సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏపీలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా సునీత అడుగు పెట్టబోతున్నారు. అది కూడా వైఎస్ జగన్ కు అపోజిట్ గా మరియు తమకు, తన పెదనాన్నకు కలసి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు తెలుస్తుంది. ఇప్పటికే సోదరి షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టడంతో.. తాను కూడా ఆ పార్టీలోనే జాయిన్ అవ్వాలని సునీత నిర్ణయించుకున్నారని వినికిడి. అంతే కాదు పార్టీ ఆదేశిస్తే కడప ఎంపీ??? లేదంటే పులివెందుల ఎమ్మెల్యే??? అభ్యర్థిగా పోటీ చేయాలని సునీత నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

See also  Gummanur Jayaram: ఉదయం వైసీపీకి రాజీనామా.. సాయంత్రం టీడీపీ లోకి.. ఎవరో కాదు మంత్రి గుమ్మానురు జయరామ్!

ఇప్పటికే పార్టీలో ఇంచార్జిల మార్పులతో వైసీపీ పార్టీ గందరగోళం లో ఉంటే, ఇప్పుడు పులి మీద పుట్రలా సొంత వాళ్ళు కాంగ్రెస్ లో చేరితే YS Jagan ప్రతిష్ట పలచనవడం ఖాయం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top