
AP Chief Secretary Video review
ఎన్నికల షెడ్యూల్(Election Schedule 2024) వెలువడిన 24 గంటల్లోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలి అని Chief Secretary Video review లో చెప్పారు
వివిధ పబ్లిక్ ఆస్థులు అనగా బహిరంగ ప్రదేశాలు,బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే,రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు,మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన అడ్వర్టైజ్మెంట్లు,వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు వంటివన్నీటినీ వెంటనే తొలగించాలి.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లను నిలిపి వేయాలి.. అంతేగాక ప్రభుత్వ వెబ్సైట్ లో మంత్రులు తదితర ప్రజా ప్రతినిధులు,రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలను వెంటనే తొలగించాలి.
మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారంలో వాడొద్దు. మంత్రుల ఎన్నికల పర్యటనలకు ప్రభుత్వ అతిథి గృహాలను కేటాయించరాదు. వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపి, ఎంఎల్ఏలు వంటి ప్రజా ప్రతినిధుల ఫొటోలు ఉండరాదు.. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండరాదు. మంత్రులు అధికారుల మధ్య ఎటువంటి వీడియో సమావేశాలు నిర్వహించరాదు..
విద్యుత్, నీటి బిల్లులు,బోర్డింగ్ పాస్ లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి ఉండరాదు. ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా వారి హెడ్ క్వార్టర్ విడిచి వెళ్ళడానికి వీలు లేదు. ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు,సిబ్బందిని బదిలీ చేయడానికి వీలులేదు ..
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా,గిఫ్టులు, ఇతర లబ్దిలు పొందినా అలాంటి వారిపై సిసిఏ నిబంధనలు ప్రకారం ఐపిసి సెక్షన్ 171 మరియు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123,129,134,134 ఎ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
-By Guduru Ramesh Sr. Journalist