
Summer Vacations 2024
ఏపీ ప్రభుత్వం(AP Govt) స్కూళ్లకు వేసవి సెలవులు(Summer Holidays 2024) ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పాఠశాలల(Schools)కు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి. జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏప్రిల్ 2న అధికారక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 23 నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేసి, ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
ఏపీలోని పాఠశాలలకు గతేడాది మే 1న వేసవి సెలవులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు మొదలుకానున్నాయి. జూన్ 11 వరకు అంటే.. దాదాపుగా 48 రోజులు పాటు పాఠశాలలకు వేసవి సెలవులు రానున్నాయి.
