AP Voters Final list 2024 released: ఏపీలో ఓటర్ల తుది జాబితా-2024 విడుదల! డైరెక్ట్ లింక్ here..

Share the news
AP Voters Final list 2024 released: ఏపీలో ఓటర్ల తుది జాబితా-2024 విడుదల! డైరెక్ట్ లింక్ here..

AP Voters Final list 2024

త్వరలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించింది. ఓటరు తుది జాబితాను తమ official website https://ceoandhra.nic.in/ లో Final SSR 2024 పేరుతో తుది ఓటర్ల జాబితాను ఉంచినట్లు Election Commission తెలిపింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఫైళ్ళను ఈసీ అప్‌లోడ్ చేసింది.

డైరెక్ట్ లింక్: AP Voters Final list 2024

ఇక గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైన ముసాయిదా జాబితాపై అనేక విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. జీరో డోర్ నెంబర్‌తో ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని తుది ఓటర్‌ జాబితాలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. తుది జాబితాలో కూడా తప్పులు దొర్లితే అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయో అని ఆందోళన నెలకొంది.

See also  Ambati Rayudu Playing AP T20? : పవన్ కల్యాణ్‌తో భేటీ.. జనసేన పార్టీలోకి అంబటి రాయుడు.!

అక్టోబర్ 27 న విడుదల చేసిన ముసాయిదా జాబితా కన్నా ఫైనల్ లిస్టు (AP Voters Final list) లో 5.8 లక్షల ఓటర్లు పెరిగారని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (CEO ) ముకేష్ కుమార్ కుమార్ మీనా తెలిపారు. యువ ఓటర్ల సంఖ్య 5 లక్షలు పెరిగిందన్నారు.

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top