ఏపీని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తా.. ఇది మోదీ గ్యారంటీ -ప్రజాగళం సభలో Narendra Modi !

ప్రాంతీయ ఆకాంక్షలు.. జాతీయ ప్రగతి రెండూ అవసరం. ఈ రెండింటినీ ఎన్డీఏ సమన్వయం చేస్తుంది. చంద్రబాబు(Chandra Babu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ప్రజల కోసం చంద్రబాబు, పవన్ ఎంతో కష్టపడుతున్నారు -Narendra Modi
Share the news
ఏపీని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తా.. ఇది మోదీ గ్యారంటీ -ప్రజాగళం సభలో Narendra Modi !

Narendra Modi at Prajagalam

నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అని ప్రసంగం మొదలు పెట్టిన Narendra Modi. నిన్ననే దేశంలో ఎన్నికల శంఖారావం మోగింది. ఎన్నికల శంఖారావం మోగాక నా తొలి సభ ఇదే. జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీఏకు 400 కు పైగా సీట్లు వస్తాయి. దేశంలో ఎన్డీఏకు 400 సీట్లు దాటాలి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ(NDA) ప్రభుత్వం ఏర్పాటు కావాలి. అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఇక్కడ ఎన్డీఏ గెలవాలి.

ప్రాంతీయ ఆకాంక్షలు.. జాతీయ ప్రగతి రెండూ అవసరం. ఈ రెండింటినీ ఎన్డీఏ సమన్వయం చేస్తుంది. చంద్రబాబు(Chandra Babu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ప్రజల కోసం చంద్రబాబు, పవన్ ఎంతో కష్టపడుతున్నారు. ఎన్డీయే కూటమి బలం పెరుగుతోంది. చంద్రబాబు చేరికతో ఎన్డీయే బలపడింది. ఏపీని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తా.. ఇది మోదీ గ్యారంటీ. ఏపీలో ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కార్ ఆవశ్యకత ఉంది. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఎన్డీయే సమన్వయం చేస్తుంది. దేశంలోని ఎన్డీయే ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తుంది- ఎన్డీఏ సర్కారు పేదల కోసం పనిచేస్తుంది. వికసిత భారతం కోసం ఎన్డీఏకు 400 సీట్లకు పైగా రావాలి.

See also  Ind vs Eng 1st Test Day2: 175 పరుగుల ఆధిక్యంలో భారత్.. సత్తా చాటిన రాహుల్ & జడ్డు..

Also Read: మోదీపై ప్రశంసల జల్లు.. జగన్ పై నిప్పులు.. -ప్రజాగళం సభలో చంద్రబాబు

పల్నాడు జిల్లాలో 5 వేల ఇళ్లు ఇచ్చాం. జల జీవన్ మిషన్ పథకం కింద కోటి ఇళ్లకు నీరు ఇచ్చాం. ఆయుష్మాన్ భారత్ తో ఏపీలో కోటి 25 లక్షల మందికి లబ్ధి. కిసాన్ సమ్మాన్ నిధితో పల్నాడు ప్రజలకు 700 కోట్లిచ్చాం. ఎన్డీఏలోని ప్రతి సభ్యుడూ ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాం. తిరుపతిలో ఐఐటీ, ఐసర్ నిర్మించాం. విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ ఏర్పాటు చేశాం. విజయనగరం జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం. మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించాం. ఆంధ్రప్రదేశ్ యువత కోసం జాతీయ విద్యా సంస్థలు స్థాపించాం. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించాం.

ఇండియా కూటమిలోని పార్టీలు పరస్పరం విరుద్ధంగా పనిచేస్తుంటాయి. కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి పరస్పరం పోటీ పడతాయి. కాంగ్రెస్, లెఫ్ట్ ఢిల్లీలో మాత్రం కలిసిపోతాయి. ఎన్డీఏ కూటమి పరస్పరం విస్వాసాల ఆధారంగా పనిచేస్తుంది. ఇండియా కూటమి అవసరాల కోసం ఏర్పాటైన స్వార్థపరుల బృందం. కాంగ్రెస్ ఇండియా కూటమి మిత్రులను వాడుకుని వదిలేస్తుంది.

See also  Subsidized Whiskey and Beer for the Poor: రేషన్ షాపుల్లో విస్కీ, బీర్ సేల్స్.. లోక్‌సభ అభ్యర్థి విచిత్ర హామీ!

Also Read: బొప్పూడి ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ ప్రసంగం!

రామాలయ ప్రారంభం రోజు మీరు ఇంటింటా రాముడిని స్వాగతించారు. రాముడు, కృష్ణుడిని ఎన్టీఆర్ తెలుగు సమాజంలో సజీవంగా ఉంచారన్న ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi).

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అవినీతికి చరమగీతం పాడాలని ప్రధాని మోడీ(Narendra Modi) రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో రాష్ట్ర మంత్రులు ఒకరిని మించి ఒకరు అవినీతిలో పోటీపడ్డారన్నారు. జగన్(Jagan), షర్మిల వేరువేరు కాదని ఇద్దరూ ఒకటే అన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. చంద్రబాబు సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమని. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా ఆయనకు మద్దతుగా నిలవాలన్న ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi).

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top