Attacks on Press Offices: పాత్రికేయుల పత్రికా కార్యాలయాల పై దాడులు అప్రజాస్వామికం

Share the news
Attacks on Press Offices: పాత్రికేయుల పత్రికా కార్యాలయాల పై దాడులు అప్రజాస్వామికం

Attacks on Press Offices:

అనంతపురం జిల్లా రాప్తాడు లో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుల పైన, కర్నూలు లో ఈనాడు పాత్రికేయులు మరియు కార్యాలయాల పై అధికార పార్టీ నాయకులు దాడులకు తెగబడటం అప్రజాస్వామికం అని జై భీమ్ రావ్ భారత్ పార్టీ(JaiBhim Rao Bharat Party) బాపట్ల జిల్లా అధ్యక్షుడు న్యాయవాది దోవా రమేష్ రాంజీ(Doa Ramesh Ranji) తీవ్రంగా ఖండించారు.

బుధవారం బాపట్ల(Bapatla) జిల్లా రేపల్లె(Repalle) నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం నాలుగో స్తంభమైన మీడియా, ప్రతికా స్వేచ్ఛపై ఎన్నడూ లేని విధంగా అత్యంత హింసాత్మక తీవ్ర దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి లో ఇసుక అక్రమ తవ్వకాలను బయట పెట్టేందు వెళ్లిన న్యూస్ టుడే విలేకరి పై కొంత మంది హత్యాయత్నానికి పాల్పడడం, రాప్తాడు లో అధికార పార్టీ నిర్వహించిన సిద్ధం సభలో జనాల ఫోటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి పత్రిక ఫోటో జర్నలిస్టు పై దాడికి తెగబడడం, కర్నూల్ లో అరాచక శక్తి గా మారిన ఓ నేత గురించి కధనం రాస్తే ఈనాడు కార్యాలయంపై రాళ్లు విసిరి విధ్వంసానికి పాల్పడటం ఏంటని ఆయన ప్రశ్నించారు.

See also  TDP-Janasena Satires on YCP Siddham: టీడీపీ-జనసేన కూటమి సిద్ధం విమర్శనాత్మక పోస్టర్ల ఆవిష్కరణ..

ప్రభుత్వ వైఫల్యాలు అవినీతి అక్రమాలను బయట పెడుతున్నారని అక్కసుతో పాత్రికేయుల మీడియా కార్యాలయాలపైన(Attacks on Press Offices) దాడులు చేయడం తగదన్నారు. పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై దాడి చేయటమంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. ఇటువంటి దాడులుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వ ప్రాయోజిత హింసను అడ్డుకోకపోతే పత్రిక స్వేచ్ఛ అనే మాట మర్చిపోవటంతో పాటు పెను ప్రమాదం ముంచుకొస్తుందన్నారు. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేసి ఆయా ఘటనలకు పాల్పడినటువంటి బాధ్యులను గుర్తించి కఠిన శిక్ష పడేలాగా తమవంతుగా కృషి చేయాలని ఆయన కోరారు.

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top