Awareness to Prevent Road Accidents: రోడ్డు ప్రమాదాల నివారణకై అవగాహన

Share the news
Awareness to Prevent Road Accidents: రోడ్డు ప్రమాదాల నివారణకై అవగాహన

Awareness to Prevent Road Accidents

రేపల్లె: రోడ్డు ప్రమాదాల నివారణ(Prevent Road Accidents) అందరి బాధ్యత అని పట్టణ డిఎస్పి మురళీకృష్ణ అన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన 35 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు(National Road Safety Week) రేపల్లె పట్టణంలోని రామశాస్త్రి కల్యాణ మండపంలో నిర్వహించారు. రహదారుల భద్రత పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ముఖ్యఅతిథిగా డిఎస్పీ మురళీ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న వాహన ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరు రహదారి నిబంధనలు పాటించాలన్నారు. ఆటోలు ఓవర్ లోడింగ్ చేయవద్దని సూచించారు.

అతివేగం రోడ్డు ప్రమాదాలకు(Road Accidents) కారణమని వాహన చోదకులు అతివేగాన్ని నియంత్రించాలన్నారు. లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు తీసుకోవడం నేరమన్నారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు తమ వాహనాలను ఇవ్వటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. త్రిబుల్ రైడింగ్ చట్టరీత్యా నేరం అన్నారు. త్రిబుల్ రైడింగ్ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

See also  Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో B.Tech, డిగ్రీ అభ్యర్థులకు 381 ఉద్యోగాలు

స్కూల్ యాజమాన్యాలు లైసెన్సు లేని వారిని బస్ డ్రైవర్లుగా నియమించరాదని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారించేందుకు కృషి చేయాలన్నారు. అవగాహనతో వాహనాలు నడిపినట్లయితే చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. అవగాహన లేమితో ఓవర్ స్పీడ్ తో వాహనాలు నడపటం, ట్రాఫిక్ నిబంధన పాటించకపోవడం, త్రిబుల్ రైడింగ్ ఓవర్ లోడింగ్ ప్రమాదాలు కారణంగా తెలిపారు. ప్రతి ఒక్కరూ అవగాహనతో ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారించాలని సూచించారు.

కార్యక్రమంలో రవాణా శాఖ అధికారిణి ప్రసన్నకుమారి మాట్లాడుతూ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా వాహన చోదకులకు ప్రమాదాల పట్ల అవగాహన కల్పించి వాటిని నివారించేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top