
కాంగ్రెస్ నుంచి రిటైర్డ్ ACP కి Bapatla MLA Seat?
Bapatla MLA Seat రిటైర్డ్ ACP నెమలికంటి సుధీర్ కు షర్మిల ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం. ఈయన హైదరాబాద్ – గోపాలపురం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా చేశారు. ఈ మధ్యనే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఈయన షర్మిల భర్త బ్రదర్ అనిల్ కు అత్యంత సన్నిహితుడు అని తెలుస్తుంది.
ఇప్పుడు ఆయన బాపట్ల నియోజకవర్గ స్థానికుడిగా కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి అంటున్న రాజకీయ విశ్లేషకులు. సుధీర్ రాకతో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పెను మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. మెజారిటీ ఓటర్లైన దళిత, రెడ్డి ఓట్లను కొల్లగొట్టి బాపట్ల ఎమ్మెల్యేగా సుధీర్ గెలవడానికి అవకాశాలు ఉన్నాయని అంటున్న విశ్లేషకులు.
ఏది ఏమైనప్పటికి షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత దళిత, రెడ్డి సామాజిక వర్గాలను నుంచి కొంత శాతం ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. అది ఎంత అనేది ఎలెక్షన్స్ అయిన తరువాత మాత్రమే తెలుస్తుంది. ఇది జగన్ గెలుపు అవకాశాలను చాలా దెబ్బ తీసే అవకాశం అయితే వుంది.
-By Guduru Ramesh Sr. Journalist