సంక్రాంతి సందర్బంగా , పవన్ కళ్యాణ్ ని డిన్నర్ కి ఆహ్వానించిన చంద్రబాబు
పవన్ కళ్యాణ్, లోకేష్ ఆత్మీయ ఆలింగనం
మూడు గంటల పైగా ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చర్చలు
CBN and Pawan కలసి ప్రచారం చేయవల్సిన సభలు పైనా చర్చ

CBN and Pawan విందు రాజకీయాలు
తెలుగుదేశం(TDP) పార్టీ అధినేత చంద్రబాబు(Chandra Babu), జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan kalyan) తాజాగా ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. శనివారం జరిగిన CBN and Pawan Dinner సమావేశంలో నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ సైతం పాల్గొన్నారు. ఇరు పార్టీల కీలక నేతలు ఉమ్మడి మేనిఫెస్టోపైన, సీట్ల పంపిణీ పైన 3 గంటలు పైగా చర్చించుకున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడిగా చేయవల్సిన కార్యక్రమాలు, CBN and Pawan కలసి ప్రచారం చేయవల్సిన సభలు గురించి కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తుంది.
టీడీపీ(TDP), జనసేన(Janasena) పార్టీల ముందున్న సవాళ్లు
ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించి వైసీపీ తో పోటీ పడాలి అంటే తాము కూడా సంక్రాంతి తరువాత తమ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయవలసి వుంది.
ప్రవాహం లా వైసీపీ నుంచి వస్తున్న ఆ పార్టీ అసంతృప్తులు టీడీపీ మరియు జనసేన లో చేరుతున్న విషయం తెల్సిందే. పాత కాపులు తో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి సీట్ల కేటాయింపు పెద్ద తల నొప్పి గా మారేలా వుంది
చర్చల తో సరిపెట్టకుండా, ఎవరు ఎన్ని స్థానాలు, ఎక్కెడెక్కడ అనేది కూడా నిర్ణయించుకుని త్వరగా రంగంలోకి దిగాలి. ఈ విషయంలో మూడు జాబితాలు విడుదల చేసి వైసీపీ ముందుంది.
బీజేపీ తో పొత్తు విషయం కూడా త్వరగా తేల్చాలి. ఏపీలో బీజేపీ కి పెద్ద వోట్ షేర్ లేకపోయినా పొత్తు పెట్టుకుంటే ఎలెక్షన్స్ టైం లో కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అదీ కాకుండా సెంటర్ లో బీజేపీ బలం తెల్సిందే.
టీడీపీ, జనసేన పై స్థాయి నాయకుల మధ్య సమనవ్వయం బాగానే వున్నా, కార్యకర్తలు మధ్య కోర్డినేషన్ ఇంకా పెంచేలా చర్యలు తీసుకోవాలి.
కొస మెరుపు
ఇన్ని భేటీలు జరుగుతున్నా, చర్చల సారాంశం మాత్రం అధికారకంగా బయటకు రావడం లేదు.