
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు.. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థుల వర్క్ షాప్ లో CBN
టిడిపి(TDP) కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన వర్క్ షాప్ లో Chandra Babu Naidu(CBN) మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తుపై అందరి కంటే ముందు సహకరించిన వ్యక్తి పవన్ కల్యాణ్(Pawan Kalyan). ఏకైక అభిప్రాయంతో పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తుకు పవన్ ముందుకు వచ్చారు జనసేన(Janasena) కార్యకర్తలు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నారని కొనియాడారు. పొత్తులో భాగంగా 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం సీట్లు రానివారు కష్టపడలేదని కాదు.. రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నారని చెప్పారు.


మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేశామన్నారు. మూడు పార్టీల ఆలోచన ఒక్కటే.. నిలబెట్టిన అభ్యర్థి గెలవాలనేది లక్ష్యం అన్నారు. రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకం అని ఎంపికలో తప్పు చేస్తే కొన్ని సీట్లు పోయే ప్రమాదమూ ఉందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కసరత్తు చేసి సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదన్నారు. సేవా భావంతో మంచి వ్యక్తులు ముందుకొచ్చినప్పుడు స్వాగతించామని చెప్పారు.నాయకుల్లో డబ్బు సంపాదనే కాదు.. సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన వస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగువాళ్లు ప్రపంచమంతా రాణిస్తున్నారని CBN గుర్తు చేశారు.
అలవోకగా అబద్దాలు చెప్పడమే జగన్(Jagan) పనిగా పెట్టుకున్నారని CBN విమర్శించారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధించడం మొదలుపెట్టారు ఇవాళ కొంతమందికి సీట్లు ఇవ్వకపోవచ్చు. కానీవాళ్లు చేసిన త్యాగం నేనెప్పుడూ మరచిపోను. జైలుకు పోయారు.. మానసికంగా క్షోభ అనుభవించారు. నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్లు కష్టపడి పనిచేశారు. ఐదేళ్లలో జగన్ ఇంత ఘోరంగా రాజకీయాలు చేస్తారనుకోలేదు. ఇలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. అబద్ధాలు చెప్పి మరోసారి గెలవాలనేదే జగన్ ప్రయత్నం. వీళ్లను కట్టడి చేయాలంటే పూర్తిగా డిజిటల్ కరెన్సీ పెట్టాలి. రాబోయే రోజుల్లో డబ్బుతో కాకుండా సేవాభావంతోనే ముందుకొచ్చే పరిస్థితి తీసుకురావాలి.
జగన్ ప్రవర్తన చూస్తుంటే వ్యాపారాన్ని రాజకీయం చేస్తున్నారు. ఏపీని డ్రగ్స్ అడ్డాగా వైసీపీ మార్చింది. తప్పు చేసి ప్రతిపక్షాలపై నెట్టుతున్నారు. ఏ ఒక్క రోజు డ్రగ్స్ మీద జగన్ రివ్యూ చేయలేదు. గంజాయి, డ్రగ్స్ పై మొదట్నుంచి టీడీపీ పోరాడుతోంది. గంజాయిపై పోరాడుతుంటే టీడీపీ ఆఫీసుపై దాడి చేశారు. విశాఖ డ్రగ్స్ తో వైసీపీ నేతలకు సంబంధాలున్నాయి. బ్రెజిల్ నుండి డ్రగ్స్ కంటెయినర్ విశాఖ వచ్చింది. బ్రెజిల్ ప్రెసిడెంట్ గెలవగానే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఐదేళ్లుగా ఏపీలో డ్రగ్స్ మాఫియాను పెంచి పోషించారు. ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు నడిపే స్థాయికి దిగజారిపోయారు.
నేరం వాళ్లు చేసి మాపై నెట్టాలని చూస్తున్నారు. సంధ్య ఆక్వా యజమాని వైసీపీ నేతకు బంధువు. ఐదేళ్లలో ఏపీపీఎస్‌సిని భ్రష్టు పట్టించారు. గ్రూప్ వన్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారు. కోర్టుకు రెండు సార్లు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు. ఏపీపీఎస్‌సీ లోని పాత రికార్డ్స్ నాశనం చేయాలని చూస్తున్నారు.
గన్నవరంలో వైసీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే మాధవి ఫొటో తీశారు. మాధవిపై వైసీపీ మూకలు దాడికి యత్నించాయి. వైసీపీ మూకలకు భయపడకుండా మాధవి గట్టిగా సమాధానం చెప్పారు, గట్టిగా నిలబడి పోరాడారు
డ్రగ్స్, గంజాయి, మద్యంలో వేల కోట్లు దోపిడీ చేశారు. భూకబ్జాలు, మైనింగ్ మొత్తం లూటీ చేశారు 40 ఏళ్లకు పైగా సంపాదించిన ఆస్తిని.. బెదిరిస్తే అప్పగించే పరిస్థితి దాపురించిందని CBN అన్నారు.
-By Guduru Ramesh Sr. Journalist