Chinta Mohan Comments On Chiranjeevi: సీఎం అభ్యర్థిగా చిరంజీవి- మాజీ ఎంపీ చింతా మోహన్

Share the news
Chinta Mohan Comments On Chiranjeevi: సీఎం అభ్యర్థిగా చిరంజీవి- మాజీ ఎంపీ చింతా మోహన్

Chinta Mohan Comments On Chiranjeevi

ఎవరు ఎప్పుడు ఏ పార్టీకి మారుతారో తెలియని గందరగోళంలో ఏపీ రాజకీయాలు ఉంటే, దాన్ని ఇంకాస్త పెంచుతూ చింత మోహన్(Chinta Mohan) కామెంట్స్ చేశారు. కాపులకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, రాజకీయాల్లోకి చిరంజీవి (Chiranjeevi) మళ్లీ వచ్చి పోటీ చేస్తే 50 వేల ఓట్లతో గెలిపించుకుంటాం అన్నారు. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా అనేది చిరంజీవి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇది Chinta Mohan సొంత అభిప్రాయమో లేదా కాంగ్రెస్(Congress) అధిష్ఠానం కూడా ఆ దిశగా ఆలోచిస్తుందో తెలియదు. ఒకోసారి అధిష్టానం ఇలాంటి వారి ద్వారా లీకులు కూడా ఇస్తుంది.

రాష్ట్రంలో I.N.D.I.A కూటమి లో ఉన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. కాకినాడ లోక్ సభ నుంచి CPM పార్టీ జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి పోటీ చేయాలని కోరారు. నగరి అసెంబ్లీ నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు Chinta Mohan చెప్పారు. గత కొంతకాలం నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన వస్తోందన్నారు. కాంగ్రెస్ రావాలని.. కావాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

See also  Farce of Letters: లేఖల ప్రహసనం.. మొన్న హరి రామజోగయ్య లేఖ.. ఇప్పుడు ముద్రగడ లేఖ!

ఇక తెలంగాణా లో తమకు మేలు చేసిన బాబు కోసం షర్మిలా ని చేర్చుకొని వైసీపీ ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే, చింతా మోహన్ ఏమో చిరంజీవి సీఎం అంటాడేమిటి? ఒకవేళ చిరంజీవి కాంగ్రెస్ లోకి పొరపాటున మరల వస్తే జనసేన + టీడీపీ కూటమి ఓట్లు చీలవా? అయినా చిరంజీవి మరల కాంగ్రెస్ లో చేరడం అనేది కల్లో మాట. చిరంజీవి తన జీవితంలో వేసిన తప్పటడుగు ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ లో చేరడమే. అలాంటిది మరలా కాంగ్రెస్ లో చేరడం అనేది ఎప్పటికి జరగదు. చింతా మోహన ఏదో జనాల ఆటెంషన్ కోసం మాట్లాడిన మాటలే కానీ, కాంగ్రెస్ ని ఏపీ ప్రజలు ఎప్పుడో మరచి పోయారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top