Chiranjeevi Support: సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కు మద్దతు తెలిపిన చిరంజీవి.. దాంతో పాటు కూటమికి కూడా..

Share the news
Chiranjeevi Support: సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కు మద్దతు తెలిపిన చిరంజీవి.. దాంతో పాటు కూటమికి కూడా..

రమేష్ ల ద్వయం కు Chiranjeevi Support

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కారణంగా చిరంజీవి (Chiranjeevi) నోట మరోసారి రాజకీయాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. చిరంజీవి రాజకీయాలకు దూరంగా వున్నా, తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉండటంతో రాజకీయాలు చిరంజీవిని వదిలిపెట్టడంలేదు. ఆయన పేరు చుట్టూ రాజకీయాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు రమేష్ ల ద్వయం కు Chiranjeevi Support గా మాట్లాడారు.

తాను చాలా సంవత్సరాల తర్వాత రాజకీయాల ప్రస్తావన తీసుకు రావడానికి ప్రధాన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అని చిరంజీవి చెప్పారు. జనసేన(Janasena), బీజీపీ(BJP), తెలుగుదేశం(TDP) కూటమిగా ఏర్పడటం సంతోషమని, మంచి పరిణామం అని చిరంజీవి చెప్పారు. బీజీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబుకు ఓటు వేయమని ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

See also  Malla Reddy: మల్లా రెడ్డి మళ్లీ పార్టీ మారుతుండా?

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయన తనకు చిరకాల మిత్రుడు అని చిరంజీవి అన్నారు. అలాగే, పంచకర్ల రమేష్ బాబు తన అశీసులతో రాజకీయ అరంగేట్రం చేశారని చిరంజీవి చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున 2009లో తొలిసారి పెందుర్తి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి మరోసారి పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు. వాళ్లిద్దరితో కలిసి చిరంజీవి ఒక వీడియో విడుదల చేశారు.

ఇక జనసేన వెంటే చిరంజీవి అభిమానులు!
చిరంజీవి పిలుపుతో అభిమానులు, ఆయన అనుచరులు పూర్తిగా జనసేన పార్టీ వెంట నడుస్తారని రాజకీయ వర్గాల అంచనా. పలు ప్రాంతాల్లో జనసేన, తెలుగు దేశం, బీజేపీ కూటమికి చిరంజీవి ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నట్లు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

1 thought on “Chiranjeevi Support: సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కు మద్దతు తెలిపిన చిరంజీవి.. దాంతో పాటు కూటమికి కూడా..”

  1. Pingback: Pawan Kalyan Warning: చిరంజీవి జోలికొస్తే ఊరుకోను .. సజ్జలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్! - Samachar Now

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top