
Chittoor MLA Arani Srinivasulu Met Pawan Kalyan
చిత్తూరు ఎమ్మెల్యే(Chittoor MLA) ఆరణి శ్రీనివాసులు ఆదివారం హైదరాబాద్‌లో జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఆయనతో కాసేపు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తుంది. ఇటీవల వైసీపీ అధిష్టానం చిత్తూరు అసెంబ్లీ ఇంఛార్జ్‌గా విజయానందరెడ్డిని నియమించింది. దాంతో తనను కాదని వేరొకరికి తన నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ తో సమావేశమై చర్చించారు. త్వరలోనే వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు
ఇది ఇలా ఉండగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై వైసీపీ చర్యలు తీసుకుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి వేరే పార్టీ అధ్యక్షుడ్ని కలిశారంటూ ఆయనపై వైసీపీ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఓ వైపు వైనాట్ 175 నినాదంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఇంఛార్జ్‌ల వరుస జాబితాలు విడుదల చేస్తున్నారు. మరోవైపు తమ సీటు గల్లంతు కావడంతో అసంతృప్తులు జనసేన, టీడీపీ పార్టీల్లో చేరడానికి క్యూ కడుతున్నారు. ఇదివరకే కొందరు నేతలు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరగా.. తాజాగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు.. చూస్తుంటే ఈ వలసలు ఇప్పట్లో ఆగేలా లేవు.
: