![Rajesh Mahasena Issue: రాజేష్ మహాసేనను మారుస్తున్నారా? అతని స్థానంలో కొత్త అభ్యర్థిని పరిశీలిస్తున్నారా?](https://samacharnow.in/wp-content/uploads/2024/03/Rajesh-Mahasena.webp)
Rajesh Mahasena Issue
సరిపెల్ల రాజేష్ మహాసేన(Rajesh Mahasena) పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. మొదట్లో ఒక అగ్ర కులంపై ఆయన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు. ఆ తర్వాత 2014లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలను ఎవరూ ప్రశ్నించలేదు. ఆ తరువాత మహాసేన రాజేష్..జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. తాను వైసీపీ పార్టీలో లేనని చెప్పారు. ఈ క్రమంలో దళితులపై జరుగుతున్న దాడులు.. ఇతర అంశాలపై పోరాటం చేశారు, YouTuble లో అయన వాయిస్ వినిపించేవాడు. చివరికి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ కోసం బాగానే శ్రమించారు. ఆయన కష్టానికి పి.గన్నవరం టిక్కెట్ ను చంద్రబాబు కేటాయించారు.
ఇక ఇప్పుడు ఆయన గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని కొంత మంది తెరపైకి తెచ్చి ఆయన్ను ఇరుకున పెడుతున్నారు. దాంతో పాటు చంద్రబాబు(Chandra Babu), లోకేష్(Lokesh), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లను విమర్శిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వకూడదని, ఇస్తే ఓడిస్తాం అని కొన్ని సంఘాలు హెచ్చరించాయి కూడా. ఆయనపై విమర్శల దాడి రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీ కి చెందిన సోషల్ మీడియా ఖాతాలతో పాటు కొన్ని మీడియాలు కూడా ఆయనకు వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేస్తున్నాయి అని రాజేష్ అంటున్నాడు
టీడీపీ(TDP) Rajesh Mahasena ను పోటీ నుంచి తప్పిస్తుందా?
రాజేష్ మహాసేన(Rajesh Mahasena) పై వివాదాలు కాసేపు పక్కన పెడితే, అయన ఒక సామాన్య వక్తి స్థాయి నుంచి MLA అభ్యర్థి గా ఎదిగాడు. హిందూ సంఘాలు, కార్యకర్తలపై మాటల యుద్ధాలు, కొన్ని కేసులు ఆయన్ను వివాదాస్పదుడని చేశాయి. ఇంకోవిదంగా అవే ఆయనకి హిందూ, బ్రాహ్మణ వ్యతిరేఖి గా ముద్ర వేసాయి. టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చిన తరువాత, ఆయనపై విమర్శల దాడి పెరిగిపోయింది. ఆయన ఇది వైసీపీ వాళ్ళు చేయిస్తున్నది అని అంటున్నాడు. ఈ నేపథ్యంలో అయన టీడీపీ పార్టీకి నష్టం వచ్చేటట్లైతే టికెట్ వదులు కోవడానికి కూడా రెడీ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఆయనకు టికెట్ నిరాకరిస్తే, SC మాల కమ్యూనిటీ లో టీడీపీ మీద వ్వతిరేకత పెరగవచ్చు. అలా అని కొనసాగిస్తే కొన్ని హిందూ సంఘాలనుంచి TDP మీద వ్యతిరేఖత రావచ్చు.
ఇక రాజేష్ మహాసేన “కులరక్కసి చేతిలో మరోసారి బలైపోయాను.. జగన్ రెడ్డీ… గుర్తుపెట్టుకుంటాను! .. పోటీ నుండి నేనే స్వచ్చందంగా తప్పుకుంటాను! నాకోసం నా పార్టీనీ, చంద్రబాబుగారినీ, పవన్ కళ్యాణ్ గారినీ, లోకేష్ గారినీ ఎవ్వరూ తిట్టొద్దు” అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసాడు. కిందిస్థాయి నుంచి ఓ దళితుడు ఎదుగుతూంటే తట్టుకోలేకపోతున్నారని.. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ఈ తరహా వీడియో చేసినట్లుగా తెలుస్తోంది.
ఇక TDP మద్యే మార్గంగా రాజేష్ మహాసేన(Rajesh Mahasena) చేత, అప్పట్లో చేసిన వివాస్పద వ్యాఖ్యలపై వివరణో లేదా క్షమాపణ గాని చెప్పిస్తే కొంత వరకు ఇష్యూ సెటిల్ అవ్వవచ్చు. ప్రస్తుతానికి టీడీపీ అయితే ఆయన్ను పోటీ నుంచి తప్పించక పోవచ్చు.
ఇది ఇలా ఉంటే రాజేష్ మహాసేనకు ఇచ్చిన టికెట్ ను మరొకరికి కేటాయిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. రాజేష్ స్థానంలో పి గన్నవరం స్థానంలో మోకా బాలగణపతిని నియమిస్తారని అంటున్నారు. పి. గన్నవరం అభ్యర్థి మార్పు విషయంలో ఫోన్ కాల్స్ ద్వారా టీడీపీ అధిష్ఠానం సర్వే చేస్తున్నట్లు అంటున్నారు. నిజమెంతో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే