Criminal Case on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం!

Share the news
Criminal Case on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం!

Criminal Case on Pawan Kalyan

పవన్ కళ్యాణ్ గతంలోవాలంటీర్లపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పై వైసీపీ ప్రభుత్వం గుంటూరు జిల్లా కోర్టులో పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు(Criminal Case on Pawan Kalyan) పెట్టింది. ఐపీసీ సెక్షన్ 499, 500 కింద ఈ కేసు నమోదైంది. వాలంటీర్లు, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారని కేసులో వైసీపీ ప్రభుత్వం పేర్కొంది. కేసును పరిగణనలోకి తీసుకున్న గుంటూరు జిల్లా కోర్టు.. మార్చి 25న విచారణకు రావాలని పవన్ కళ్యాణ్‌ని ఆదేశించింది. ఈ కేసును నాలుగో అడిషనల్ జిల్లా కోర్టుకు బదిలీ చేసింది.

గతేడాది ఏలూరు జిల్లా వారాహి యాత్రలో జులై 9న పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి వస్తున్నారనీ, ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని అన్నారు. అంతేకాదు.. వాలంటీర్ల వల్ల ఇళ్లలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందనీ, కొంతమంది వాలంటీర్లు బ్లాక్‌మెయిల్స్‌కి పాల్పడుతున్నారంటూ..కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై అప్పట్లోనే వైసీపీ నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

See also  Free Haleem: హైదరాబాద్ లో ఉచిత హలీం లొల్లి.. దాని కోసం జనం వేలం వెర్రి.. అదుపు చేయడానికి పోలీసుల లాఠీ!

తాజాగా కోర్టు విచారణకు పిలవడంతో.. ఏం జరుగుతుందో అనే టెన్షన్ జనసేన(Janasena) కార్యకర్తలు, అభిమానుల్లో ఉంది. Criminal Case on Pawan Kalyan నిలబడేది కాదు అని రాజకీయ విశ్లేషకుల భావన.. కాకపోతే జనసేన పవన్ కళ్యాణ్ కి ఇలాంటివి కొంచెం చికాకు తెప్పించవచ్చు. అయన మనస్తత్వం బట్టి ఇలాంటి వాటికి ఆయన భయపడే రకం కాదు. ఇక టీడీపీతో కలిసి ఎన్నికల ప్రచారానికి జనసేన రెడీ అవుతున్న సమయంలో ఈ కేసు ఆ పార్టీకి సమస్యగా మారుతుందా? ఏమో చూడాలి.

ఇక వైసీపీ మొదటి నుంచి వాలంటీర్ల వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ పంచాయతీ వ్యవస్థ ఉన్నా, వారికి పనులు అప్పగించకుండా, వాలంటీర్లకే అన్ని పనులూ అప్పగిస్తోంది ప్రభుత్వం. వచ్చే ఎలక్షన్స్ లో పార్టీ తరుపున కూడా వాళ్ళను వాడుకోనున్నారని టాక్. అందువల్ల వాలంటీర్లకు వ్యతిరేకంగా ఎవరు కామెంట్స్ చేసినా, బలంగా తిప్పికొట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

See also  AP Inter Results 2024: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడి.. రిజల్ట్స్ చూసుకోండి ఇలా!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top