
Election Code పై రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి హేలా షారోన్
Repalle: మంగళవారం ఎన్నికల నియమ నిబంధనలపై రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల తేదీలు ప్రకటించడంతో రాష్ట్రంలో ఎ న్నికల ప్రవర్తనా నియమావళిని(Election Code) కట్టుదిట్టం చేసామన్నారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని కోరారు.
అభ్యర్థులు ప్రచారానికి ఉపయోగించే వాహనాలకు అనుమతులు తప్పనిసరి అన్నారు. ఇంటింటి ప్రచారం, ర్యాలీలు మీటింగులు పెట్టుకునేందుకు సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద అనుమతులు తీసుకోవాలన్నారు. పాంప్లెట్లు, బ్యానర్లు ,పోస్టర్లు హోర్డింగులు ఏర్పాటు విషయంలో అనుమతులు తీసుకోవాలని తెలిపారు. రాజకీయ పార్టీల మీటింగ్లతోపాటు రోడ్లపై పెట్టే సభలు సమావేశాలకు అనుమతులు తప్పనిసరి అన్నారు.
వాలంటరీలు ఎన్నికల విధులు దూరంగా ఉండాలని సూచించారు. నిబంధనలు పాటించకుండా ఒక రాజకీయ పార్టీ వైపు ప్రచారంలో పాల్గొన్న ,పాంప్లెట్లు పంచిన ,ఇంటింటి ప్రచారం నిర్వహించిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని చెరుకుపల్లిలో ముగ్గురు వాలంటీర్లను నిజాంపట్నం మండలంలో ఒక వాలంటీర్ను విధుల నుండి తొలగించామన్నారు. వాలంటరీలు ఆన్లైన్ లో గ్రూపులను ఏర్పాటు చేసి రాజకీయ ప్రచారం చేయటం చట్టరీత్యా నేరమన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పార్టీల ప్రచారాలకు చిన్న పిల్లలను ఉపయోగించవద్దని సూచించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు సువిధ పోర్టల్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన వివిధ అనుమతులను తీసుకువచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరు సువిధ పోర్టల్ ను ఉపయోగించుకొని అనుమతులు పొందాలని తెలిపారు. ఎన్నికల కోసం తాత్కాలిక పార్టీ కార్యాలయాలను పోలింగ్ స్టేషన్కు రెండు వందల మీటర్ల దూరంలో ఏర్పాటు చేయకూడదని, ప్రైవేట్ స్థలాలలో, పాఠశాల సమీపంలో, ఆధ్యాత్మిక ప్రాంతాల కు దగ్గరగా పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయవద్దని సూచించారు. నిబంధనలు పాటించకుండా కార్యాలయాలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పు వన్నరు .
బైక్ ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి చేశారు. కేవలం 10 బైకులకు మాత్రమే అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. రోడ్డు షో నిర్వహించేటప్పుడు రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఆ కార్యక్రమంలో ఎన్ని వాహనాలు వాడుతున్నది ఎంతమంది ప్రజలు వస్తారనే విషయాన్ని ముందుగానే తెలియజేయాలని సూచించారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీలు లౌడ్ స్పీకర్లను ఉదయం ఆరు గంటల లోపు రాత్రి పది గంటల తర్వాత ఉపయోగించకూడదని హెచ్చరించారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి 24/7 కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే సి విజిల్(cVIGIL ) యాప్ ద్వారా ఫిర్యాదులు చేసుకోవాలని సూచించారు. సివిజన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను 100 నిమిషాలలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు సి విజిల్ యాప్ ను ఉపయోగించుకోవాలన్నారు. ఇతర సమాచారం కొరకు ఫిర్యాదుల కొరకు ఆర్.ఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదులు ఇతర సమస్యలపై 08648 293795 నంబర్ను సంప్రదించాలన్నారు. ఎన్నికల నియమావళి(Election Code) ఉల్లంఘనలపై ఏ శాఖపైనైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల నియమావళి(Election Code) అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను వివరించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం కింద వివిధ రిజిష్టర్డ్ లబ్దిదారులకు యదావిధిగా ఉపాధి పనులు కల్పించవచ్చని చెప్పారు.
-By Guduru Ramesh Sr. Journalist