Election Code Violations: ప్రభుత్వ జీతం.. వైసీపీ కి ప్రచారం.. ఈసీకే సవాల్ విసురతున్న పారిశుద్ధ్య కార్మికుడి లీలలు!

రేపల్లెలో యదేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు(Election Code Violations).. ప్రభుత్వ జీతం తీసుకుంటూ వైసీపీ నాయకునిగా చలామణి అవుతున్న వైట్ కాలర్ పారిశుద్ధ్య కార్మికుడి లీలలు.. ఈసీకి సవాల్ విసురతున్న వైనం.
Share the news
Election Code Violations: ప్రభుత్వ జీతం.. వైసీపీ కి ప్రచారం.. ఈసీకే సవాల్ విసురతున్న పారిశుద్ధ్య కార్మికుడి లీలలు!

రేపల్లె లో వైట్ కాలర్ పారిశుద్ధ్య కార్మికుని Election Code Violations

రేపల్లె(Repalle) పురపాలక సంఘంలో యదేచ్చగ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు(Election Code Violations) జరుగుతున్నాయి. ప్రభుత్వ జీతం తీసుకుంటూ వైసీపీ(YCP) నాయకునిగా చలామణి అవుతూ నిబంధనలు అతిక్రమించి(Election Code Violations) అధికార పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పురపాలక సంఘం పారిశుధ్య కార్మికుని(Govt. Sanitation Worker)గా గత నాలుగున్నర సంవత్సరాల క్రితం విధుల్లో చేరి, అధికార పార్టీని అడ్డుపెట్టుకొని విధులు నిర్వహించకుండా అక్రమంగా జీతం తీసుకుంటున్నాడు.

పారిశుద్ధ్య కార్మికునిగా పేరు నమోదు చేసుకున్న చిత్రాల ఓబేదు తాను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాననే విషయం మర్చిపోయి, ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తున్నాడు(Election Code Violations). అధికార పార్టీ నాయకుల అండదండలతో ఈసీకి సైతం సవాలు విసురుతూ వైసిపి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారాలకు రాజకీయ పార్టీల కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, నిబంధనలు అతిక్రమించి అధికార పార్టీ అండదండలతో వైసిపి కార్యకర్తగా తనదైన శైలిలో ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడుతున్నాడు.

See also  Janasena party office opening: రేపల్లెలో ఈ నెల 18న జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం!

పురపాలకు సంఘానికి చెందిన పారిశుధ్య కార్మికునిగా విధులు నిర్వహిస్తున్న చిత్రాల ఓబేదు, వైసీపీ ప్రభుత్వ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా పారిశుధ కార్మికునిగా విధులు నిర్వహించిన దాఖలాలు లేవు. ఇతనిని వైట్ కాలర్ పారిశుద్ధ్య కార్మికుడని పలువురు సొంత పార్టీ వ్యక్తులే చమత్కరిస్తుంటారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ చిన్న కార్యక్రమం జరిగిన తానున్నానంటూ ముందుకు వస్తాడు. శనివారం రాత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) పై రాళ్ల దాడి జరిగిందని తెలియడంతో చిత్రాల ఓబేదనే వైట్ కాలర్ పారిశుద్ధ్య కార్మికుడు మిగిలిన పార్టీ కార్యకర్తలతో కలిసి పట్టణంలోని రాజ్యలక్ష్మి థియేటర్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు నాయుడు పై చర్యలు తీసుకోవాలని, పవన్ కళ్యాణ్(Pawan Kalyan), పురందరేశ్వరి(Purandeswari) లను శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశాడు.

See also  Cell Phone Exploded: సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తున్న బాలిక.. చేతిలో పేలి కుడి చేయి ఛిద్రం..

ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గడ్డం రాధాకృష్ణమూర్తి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుండగా మధ్యలో అతన్ని అడ్డుకుని, చిత్రాల ఓబేదు మాట్లాడుతూ విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణను చూడలేక దాడి చేశారని అన్నారు. విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పటి నుండి జగనన్నను అంతం చేయాలని కుట్రపన్ని టిడిపి(TDP), బిజెపి(BJP), జనసేన(Janasena) నాయకులు దాడికి తెగబడ్డారంటూ రెచ్చగొట్టాడు. ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న పోరాటానికి నిదర్శనమని ఇందులో పెత్తందారులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి, కాంగ్రెస్ పార్టీ పెద్దలని విమర్శించాడు. 24 గంటల్లో జగన్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోతే ఉద్రిక్తత పరిస్థితులు తీసుకువస్తామని తీవ్రస్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.

అనంతరం ఆదివారం ఉదయం పట్టణంలోని 18 వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గణేష్ తరఫున చేస్తున్న ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన మోకాళ్లపై నిరసనలలో పాల్గొని మరల చంద్రబాబు నాయుడుని శిక్షించాలంటూ నినాదాలు చేశాడు. ఎన్నికల నిబంధనలు పాటించకుండా, ప్రభుత్వ జీతం తీసుకుంటూ, పారిశుధ్య కార్మికుని గా విధులు నిర్వహించకుండా, పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్న చిత్రాల ఓబేదుపై ఎన్నికల సంఘం(EC) ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

See also  BJP TDP Janasena alliance: ఎట్టకేలకు బిజెపి టిడిపి జనసేన పొత్తు, సీట్ల ప్రకటన ఈ నెల 17న..

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top