
Exit Polls Results..
ప్రీ పోల్స్ సర్వేల్లానే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్(Exit Polls Results) కూడా ఏ పార్టీకి సంబంధించిన సంస్థలు ఆ పార్టీ గెలుస్తుందని చెబుతున్నారు. ఇక ఇచ్చిన వాటిలోని విషయాన్ని క్రోడీకరించి చూస్తే కేంద్రంలో మరియు ఏపీలో కూటమికే అధికారం అని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చెబుతున్నాయి. ఇక వోటింగ్ శాతానికి వస్తే NDA కూటమికి ఏపీలో 53% ఓటింగ్ రావచ్చు అంటున్న ఇండియా టుడే సర్వే. అనుకున్నట్లుగానే దాదాపు అన్ని సర్వేలు కూటమి గెలుపుని ఖాయం చేస్తున్నాయి. ఇక కొన్ని వైసీపీ అనుకూల మీడియా సంస్థలు మాత్రం వైసిపి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ చేసిన సంస్థలు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి దాదాపు వందకు పైగా సీట్లు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక పార్లమెంట్ సంగతికి వస్తే 20 ఎంపీ సీట్లకు పైగా కూటమి గెలుచు కోవడం ఖాయం అని తెలుస్తోంది.
ఏపీకి సంబంధించిన దాదాపు 40 సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించగా అందులో 35 కూటమిదే అధికార పీఠం అని తేల్చాయి ఐదు మాత్రమే వైకాపా వైపు ముగ్గు చూపాయి.
ఇంకా రెండు రోజుల్లో ఫలితాలు రాబోతున్న తరుణంలో కూడా ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఇవ్వని సంస్థలు. కారణం రాజకీయ పార్టీల పెట్టుబడులు వాటిల్లో ఉండటమే. ఇలా రాజకీయ పార్టీలు మీడియా సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఖచ్చితమైన సమాచారం ప్రజలకు తెలియడం లేదు.