Expected TDP MLA Candidates
మంగళగిరిలో నారా లోకేశ్, వేమూరులో నక్కా ఆనందబాబు, పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, తాడికొండ-తెనాలి శ్రావణ్ కుమార్, రేపల్లె-అనగాని సత్యప్రసాద్, చిలకలూరిపేట-ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండ-జీవీ ఆంజనేయులు, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు తిరిగి పోటీ చేయనున్నారని రాజకీయ విశ్లేషకుల అంచనా.
వీరిలో అనగాని సిటింగ్ ఎమ్మెల్యే, ఖచ్చితంగా గెలిచే అభ్యర్థి. కొత్తగా సత్తెనపల్లెలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాడులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి, బాపట్లలో నరేంద్ర వర్మ పోటీ చేయనున్నారు.
గుంటూరు పశ్చిమం నుంచి టీడీపీ తరఫున చాలా మంది పోటీపడుతున్నారు. ఇదే సీటును జనసేన నుంచి బోనబోయిన శ్రీనివాస యాదవ్ కోరుతున్నారు. ఇక గుంటూరు తూర్పు సీటు పైనా పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌తోపాటు కొత్తగా వచ్చిన నేత భాష్యం ప్రవీణ్ సీటును ఆశిస్తున్నారు. మాజీ మంత్రి రాజా కు తెనాలికి ప్రత్యామ్నాయంగా పెదకూరపాడు సీటు ఆశిస్తున్నారు. నరసరావుపేటలో ఇన్‌చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబుతోపాటు కడియాల లలిత్, కడియాల వెంకటేశ్.
TDP MLA Candidates పై రాజకీయ విశ్లేషకుల అంచనా కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి మరి కొంత సమయం పట్టవచ్చు, ఎందుకంటే టీడీపీ(TDP) + జనసేన(Janasena) కూటమి లోకి బీజేపీ కూడా వచ్చే సూచనలు ఉండడం వల్ల.
-By Guduru Ramesh Sr. Journalist