Former JD Lakshmi Narayana announces new political party: జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త పార్టీ ప్రకటన!

Former JD Lakshmi Narayana announces new political party, జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో ఈ రోజు విజయవాడ లో కొత్త పార్టీ ప్రకటించారు. విశాఖ ఎంపీగా పోటీ చేసే అవకాశం!
Share the news
Former JD Lakshmi Narayana announces new political party: జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త పార్టీ ప్రకటన!

Former JD Lakshmi Narayana announces new political party

ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ పెట్టిన ఆహ్వానించాలి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ గారు పార్టీ పెట్టినా ఆహ్వానించాల్సిందే. గత ఏడాదే ఆయన పార్టీని రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. ఆయన సీబీఐ JD గా వున్నప్పుడు జగన్ కేసు విచారణ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారని అందరికి తెల్సిందే.

ఇక పోతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా Former JD Lakshmi Narayana పోటీచేసి ఓడిపోయిన తర్వాత అక్కడే కొంత కాలం పని చేశారు. అయితే పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారన్న Very Silly కారణంతో జనసేనకు రాజీనామా చేశారు. ఆ తర్వాత రైతు, ప్రజా సమస్యలు, యువత ఓటింగ్ పై అవగాహన కల్పిస్తూ AP లో పర్యటించారు. తర్వాత ఆయన విశాఖలోనే మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఏ పార్టీ అన్నదానిపై స్పష్టత లేదు. ఏ పార్టీ కూడా ఆయనను ఆహ్వానించలేదు.

See also  TDP Raa Kadili Raa: సైకోను సాగనంపేందుకు రా కదలి రా…టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాటపాటి ప్రసాద్!

లక్షలాది జనం అభిమానించే పవన్ కళ్యాణ్ లాంటి వారే పార్టీ నడపడానికి డబ్బులేక కష్టపడుతున్నారు. ఈయన దగ్గర డబ్బులేదు. సపోర్ట్ చేసే జనమూ లేరు. ఇక పార్టీ ఎలా నడుపుతారు? పార్టీ నడపడానికి ఐడియాలజీ ఒకటే సరిపోదు, ముఖ్యంగా ఈ రోజుల్లో. గట్టిగా ఎన్నికలకు రెండు నెలలు కూడా లేవు. ఇప్పుడు పార్టీ ప్రకటించి ఏమి సాధించగలరు?

ఆయన ఈ ఎన్నికల్లో వైజాగ్ ఎంపీ వరకు పోటీ చేసి ఊరుకుని, తరువాత పార్టీని మెల్లగా విస్తరించుకొని 2029 ఎన్నికల బరిలోకి దిగితే మంచిది. అలా కాకుండా ఈ ఎన్నికల్లోనే రాష్ట్రమంతా అభ్యర్థులను నిలిపితే మాత్రం, ఎవరి సపోర్ట్ తో ఈ పని చేస్తున్నాడో తెలుసుకోలేనంత అమాయకులు కాదు ఏపీ ప్రజలు. ముఖ్యంగా రాయలసీమలో బలిజ సామాజిక వర్గ ఓట్లు చీల్చడానికి ప్రయత్నిస్తే. అది అధికార పార్టీకి సహకరించడానికే నని ఇట్టే ఎవరికైనా తెలిసిపోతుంది. అలాంటప్పుడు అధికార పార్టీ వ్యతిరేక పార్టీ ఓట్లు ఈయనకు ఎందుకు పడతాయి?

See also  Handloom worker's family suicide: బడుగులను బలితీసుకోవడమే సామాజిక న్యాయమా జగన్ రెడ్డీ? -టిడిపి చేనేత విభాగం

ఉన్న గౌరవం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే, Former JD Lakshmi Narayana గారు వైజాగ్ ఎంపీ వరకు పోటీ చేసి ఊరుకోవాలి. అప్పుడే ఆయన మీద గౌరవం ఉంటుంది. ఏది ఏమైనా కొద్ది రోజుల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారన్నది తేలే అవకాశం ఉంది.

Also Read News

Scroll to Top