
చేనేత కుటుంబం ఆత్మహత్య(Handloom worker’s family suicide)కు జగన్ రెడ్డిదే బాధ్యత- TDP చేనేత విభాగం
బాపట్ల జిల్లా రేపల్లె: చేనేత కార్మికుడు కుటుంబం ఆత్మహత్యకు(Handloom worker’s family suicide) కారకులైన రెవెన్యూ అధికారులను, భూ ఆక్రమణ దారులపై చట్ట పరమైన తీసుకోవాలని TDPపార్టీ చేనేత విభాగం నాయకులు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన పాలెం సుబ్బారావు తనకు పూర్వీకులు నుంచి సక్రమించిని భూమిని రెవెన్యూ అధికారులు అధికార YCP పార్టీకి చెందిన కట్టా శ్రావణి పేరుతో ఆన్లైన్లో ఎక్కించడంతో తన భూమిని కబ్జా చేశారని గ్రహించి రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఫలితం లేక పోవడంతో శనివారం సుబ్బారావు రైలు కింద పడి మృతి చెందగా, సుబ్బారావు భార్య పద్మావతి, కుమార్తె వినయ లు తాము ఉంటున్న ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన చెందారు.
ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు కుటుంబానికి ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు ఏక్స్ గ్రేషియా అందించి ఆత్మహత్యకు కారకులైన రెవెన్యూ అధికారులను భూ కబ్జాదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి పాలనలో బడుగు, బలహీన వర్గాల ఆస్తులకు రక్షణ లేదన్న విషయం చేనేత కుటుంబం బలవన్మరణం(Handloom worker’s family suicide)తో మరోసారి రుజువైందని అన్నారు. చేనేత కుటుంబం బలవన్మరణానికి ఏం సమాధానం చెప్తావ్ జగన్ రెడ్డీ(Jagan Reddy)? ఇదేనా నువ్వు చెబుతున్న సామాజిక న్యాయం అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో చేనేత కుటుంబం ఆత్మహత్యకు(Handloom worker’s family suicide) సిగ్గుచేటని ఆత్మహత్యకు జగన్ రెడ్డిదే బాధ్యత అన్నారు. వైసీపీ నేతల భూ కబ్జాలకు నిండు కుటుంబం బలైందిని ఆరోపించారు నీ సొంత జిల్లాలోనే పేదల భూములు లాగేసుకుంటున్నారంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చుని అన్నారు. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుని రికార్డులు తారుమారు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల వేధింపులను ఆ కుటుంబం తట్టుకోలేపోయిందని, విచారం వ్యక్తం చేశారు. సొంత భూమిని కోల్పోయాం.. ప్రభుత్వం న్యాయం చేయదనే ఆవేదనతో పాల సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని. బడుగు, బలహీన వర్గాలంటే జగన్ రెడ్డికి చిన్నచూపు ఉందన్నారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టార్గెట్ చేసి మరీ బీసీలను వేధిస్తు, బీసీల ఆస్తులు దిగమింగి వారిని బలితీసుకోవడం జగన్ రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు కొన్నాళ్ల క్రితం జగన్ సొంత జిల్లా కడపలో నందం సుబ్బయ్య అనే పద్మశాలీ నేతను అత్యంత దారుణంగా చంపేశారు. నేటికీ నిందితులపై చర్యల్లేవు. ఇప్పుడు మరో దారుణానికి ఒడిగట్టారని తెలిపారు వచ్చే ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలు జగన్ రెడ్డికి బుద్ది చెప్పడం ఖాయం అన్నారు. ఇకనైనా బీసీలపై దమనకాండ ఆపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
-By Guduru Ramesh Sr. Journalist