Pawan Nomination: పవన్ నామినేషన్! భారీగా తరలి వచ్చిన జనసైనికులు, ప్రజలు!

Share the news
Pawan Nomination: పవన్ నామినేషన్! భారీగా తరలి వచ్చిన జనసైనికులు, ప్రజలు!

Pawan Nomination

జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. పవన్ నామినేషన్(Pawan Nomination) సందర్బంగా భారీ ర్యాలీ చేపట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ చేబ్రోలు నివాసం నుంచి ఆయన బయలుదేరారు. ఈ సందర్బంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ కొనసాగుతుంది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ రిటర్నింగ్ అధికారి (RO) కార్యాలయంకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. నామినేషన్ ర్యాలీలో భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ జాతీయ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తుండగా భారీ ర్యాలీ ముందుకు సాగింది.

నామినేషన్ కు వెళ్లేందుకు బయలుదేరిన @PawanKalyan గారికి ప్రార్థన చేసి భారీ మెజారిటీతో గెలవాలని ఆశీర్వదించిన క్రిస్టియన్ మహిళ, పెద్దావిడ కాళ్ళకు నమస్కరించి ఆశీర్వచనాలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారు.

ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ గారు అవసరం.. పిఠాపురం ప్రజానీకం ఆయన్ని ఆశీర్వదించి అసెంబ్లీ కి పంపాలి..

జనసేనాని నామినేషన్ ర్యాలీకి అభిమానంతో స్వచ్చందంగా వేలాదిగా కదిలిన పిఠాపురం ప్రజానీకం.

See also  Pensions Distribution: పెన్షన్ల పంపిణీ పై వైసీపీ రాజకీయం చేస్తుంది -టిడిపి ప్రధాన కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top