
Internal fight in YCP
ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వైసీపీ ఇంచార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. అయితే, ప్రకాశం జిల్లా పార్టీ ఇంచార్జి హోదాలో వచ్చిన మొదటిరోజే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీవార్ మొదలైంది. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంకు ఆనుకొనిఉన్న మంత్రి మెరుగు నాగార్జున క్యాంపు కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సంతనూతలపాడుకు చెందిన మంత్రి మెరుగ నాగార్జున వర్గం మాజీ మంత్రి బాలినేని ప్లెక్సీలను తొలగించి చెవిరెడ్డి ప్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఆగ్రహంతో ఊగిపోయిన బాలినేని వర్గీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన ప్లెక్సీలను చింపేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలో వైసీపీ నేతల మధ్య వార్ తారాస్థాయికి చేరుతుండటంతో వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెవిరెడ్డిని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వైసీపీ ఇంచార్జిగా ప్రకటించడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరోసారి అలిగి హైదరాబాద్ వెళ్లిపోయినట్లు తెలిసింది. Internal fight in YCP ఇప్పట్లో చల్లారేలా లేదు.
-By Guduru Ramesh Sr. Journalist