Veligonda project: వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్

వెలిగొండ ప్రాజెక్టు(Veligonda project) తో ప్రకాశం, నెల్లూరు, వైయ‌స్ఆర్‌ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కలలు సాకారం అయ్యాయి. 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం. 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు లక్ష్యం.
Share the news
Veligonda project: వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్

Veligonda project ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భా­గమైన నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టన్నెల్‌ను 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించిన సీఎం జగన్‌(Jagan).. రెండో టన్నెల్‌ తవ్వకం పనులను ఈ ఏడాది జనవరి 21 నాటికి పూర్తిచేయించి వెలిగొండ ప్రాజెక్టును నేడు జాతికి అంకితం చేశారు. నాడు తండ్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి శంకుస్థాపన చేయగా, సీఎం హోదాలో వైయ‌స్‌ జగన్‌ ప్రారంభోత్సవం చేశారు. యుద్ధ ప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్ట్‌ జంట సొరంగాలు పూర్తి చేయించారు. ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అద్భుతమైనప్రాజెక్ట్‌ పూర్తి చేసినందుకు, వెలిగొండ ప్రాజెక్ట్ 20 ఏళ్ల కల నేడు నేరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు. మహానేత వైఎస్సార్‌ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్ట్‌ నేను పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్‌. 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది’’ అని సీఎం జగన్‌ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం తెలిపారు.ఫ్లోరైడ్ పీడత ప్రాంతమంతంట మంచి జరిగే ప్రాజెక్ట్ అవుతుందని తెలిసి కూడా ఈ టన్నెల్ పూర్తి చేయటంలో గత ప్రభుత్వం నత్త నడక పనులు చేసిందని సీఎం ఆరోపించారు.

See also  CBN Comments on Jagan: ఇంకొల్లు లో చంద్రబాబు కామెంట్స్

రెండు టన్నెళ్లు ఉన్నాయి ఒక్కోకటి 18. 8కీ. మీ. ఉంటుందని, ఇందులో 2004- 14 వరకు 20 కీ.మీ పనులు పూర్తి చేశారని, అదే 2014-19లో కేవలం 6.4 కి.మి. పనులు మాత్రమే పూర్తైయ్యాయని తెలిపారు. మీ బిడ్డ ప్రభుత్వంలో దాదాపు 11 కీ. మీ టన్నెల్ పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన అందించామని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు సంతోషంగా ఉందని ఉద్ఘాటించారు

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top