Aadudam Andhra: ఆడుదాం ఆంధ్రా సూపర్ సక్సెస్!

Aadudam Andhra: ఆడుదాం ఆంధ్ర.. ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన కల్పించటం దీని ముఖ్య ఉద్దేశం అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.
Share the news

రికార్డు స్థాయిలో పాల్గొన్న 25.40 లక్షల మంది క్రీడాకారులు
క్రీడల్లో రాణించే సత్తా ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీసాం
ఎంపికైన 14 మంది క్రీడాకారులకు అత్యున్నత శిక్షణ
ఆడుదాం ఆంధ్రాతో(Aadudam Andhra) 37 కోట్ల స్పోర్ట్స్ కిట్ల పంపిణీ
విజేతలకు 12.21 కోట్ల విలువైన బహుమతులు అందజేస్తున్నాం..
Aadudam Andhra ముగింపు వేడుకల్లో సీఎం జగన్

Aadudam Andhra: ఆడుదాం ఆంధ్రా సూపర్ సక్సెస్!

Aadudam Andhra ముగింపు వేడుకల్లో సీఎం జగన్ (Jagan Mohan Reddy)

గ్రామ స్థాయి నుంచి ఎవరూ ఎప్పుడూ ఊహించని పద్ధతిలో మట్టిలోని మాణిక్యాలను గుర్తించి సానపట్టి, సరైన శిక్షణ ఇవ్వగలిగితే మనం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయాలనేది మరో ఉద్దేశం.

క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం. 25.40 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయి. 1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో, 7346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో, 1731 పోటీలు జిల్లా స్థాయిలో, 260 మ్యాచ్‌లు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాం.

See also  World's tallest Ambedkar Statue: స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక విజయవాడే- సీఎం జగన్

ఈరోజు Aadudam Andhra ఫైనల్స్ ముగించుకొని ఈ విశాఖలో, ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తిగారి గడ్డమీద సగర్వంగా ముగింపు సమావేశాలు నిర్వహిస్తున్నాం. దాదాపు 37 కోట్ల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ కిట్లు ఇచ్చాం. 12.21 కోట్ల బహుమతులు ఈరోజు పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతోంది.

ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీరితోపాటు మిగతా ఆటలకు సంబంధించిన ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారంతా పాల్గొంటూ ట్యాలెంట్‌ కలిగిన 14 మందిని వాళ్లు దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.

క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకు, ఇద్దరు చెల్లెమ్మలకు నలుగురిని గుర్తించాం. కబడ్డీ నుంచి ముగ్గురు మగపిల్లలు, ఒక చెల్లెమ్మను గుర్తించాం. వాలీబాల్ నుంచి ఒక మగపిల్లాడు, ఒక చెల్లెమ్మ, ఖోఖో నుంచి ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. బ్యాడ్మింటన్ నుంచి కూడా ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. వీళ్లకు ఇంకా సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే పరిస్థితి ఉంటుందని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా అడుగులు వేయగలిగాం.

See also  Another Shock to YS Jagan? జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబుతుందా??

పవన్ (విజయనగరం), కేవీఎం విష్ణువర్ధిని (ఎన్టీఆర్ జిల్లా) చెల్లెమ్మ.. వీళ్లిదరినీ చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా శ్రీకారం చుట్టారు. శివ (అనపర్తికి), కుమారి గాయత్రి (కడప జిల్లా) చెల్లెమ్మను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. కబడ్డీకి సంబంధించి సతీష్ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల), సుమన్ (తిరుపతి) ఈ ముగ్గురినీ కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీమ్ దత్తత తీసుకుంది. సుమన్‌ను, సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వాలీబాల్ కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), మహిళలకు సంబంధించి మౌనిక (బాపట్ల) వీళ్లిద్దరినీ బ్లాక్ హాక్స్ సంస్థ దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)ని ఖోఖోలో తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్ ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల) వీళ్లిద్దరినీ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది.

ఈ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పైన పేర్కొన్న సంస్థలు కలిసి ఒక్కటై మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకు అ డుగులు ముందుకు పడుతున్నాయి. ఈరోజు మనం వేసిన Aadudam Andhra అడుగు ప్రతి సంవత్సరం జరుగుతుంది. మన పిల్లల్ని ఐడెంటిఫై చేసిమరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం.

See also  PM Modi to Open NACIN in AP Tour: సత్యసాయి జిల్లాలో నాసిన్ ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

సచివాలయ పరిధి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తూ, వ్యాయామానికి సంబంధించిన వ్యాల్యూను, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను మరింతగా ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహించే కార్యక్రమం. వీటివల్ల మరింత ప్రోత్సాహం ఆటలకు జరగాలి. మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కోరుకుంటున్న.

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top