
Jana Sainkulu War on YCP
రేపల్లె: అరాచక శక్తులపై పోరాడేందుకు జనసైనికులు(Jana Sainkulu) సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ హెచ్చరించారు. బుధవారం రాత్రి మంగళగిరి జనసేన పార్టీ సమీపంలోని అపార్ట్మెంట్లో పోలీసులు సోదా చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పోలీసులను అడ్డు పట్టుకోవడం సిగ్గుచేటు అన్నారు. అధికార పార్టీ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రతిపక్షాలను ఎదుర్కొనలేక పోలీసులతో విచ్చలవిడితనానికి పాల్పడుతుందని విమర్శించారు.
ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి అరాచక శక్తులుగా వ్యవహరిస్తూ టిడిపి, జనసేన కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని చూడటం అవివేకం అన్నారు. అన్నింటికీ తెగించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని టిడిపి, జన సైనికులు(Jana Sainkulu) వైసీపీ అరాచక పాలనపై యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. అధికారం శాశ్వతం కాదని రేపు అధికారం పోతే మీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.
2014 టిడిపి జనసేన ఉమ్మడి ప్రభుత్వం సమయంలో పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందారని, ఈ రోజు రాక్షసపాలన సాగిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తుటం ప్రజల్లో తీవ్ర చర్చినియాంశంగా మారిందని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలకు వెళ్లాలి తప్ప అప్రచార స్వామిగా పద్ధతుల్లో ప్రతిపక్ష పార్టీలను బెదిరింపులకు గురి చేసి వెళ్లాలనుకోవడ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పోలీసు రాజ్యం ఎంతో కాలం సాగదని టిడిపి జనసేన ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు.
రాక్షస పాలనను అంతమొందించేందుకు రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టిడిపి(TDP), జనసేన(Janasena) కార్యాలయాలపై కార్యకర్తలపై దాడులకు పాల్పడటం చేతగాని తనానికి నిదర్శనం అన్నారు. అవినీతి అక్రమ మార్గనవాలలో సంపాదించి వ్యవస్థలను తన చేతిలోనికి తీసుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వైసిపి పాలనను తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. త్వరలో వైసిపి పాలనకు చమర గీతం పాడి టిడిపి జనసేన ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.
-By Guduru Ramesh Sr. Journalist