
Janasena key decisions
ఈరోజు అవనిగడ్డ(Avanigadda) మరియు రైల్వే కోడూరు నియోజకవర్గాల గురించి జనసేన కీలక నిర్ణయాలు(Janasena key decisions) తీసుకుంది. అవనిగడ్డ శాసన సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్(Mandali Buddha Prasad) పేరును పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారు ఖరారు చేశారు. గురువారం ఉదయం పార్టీ ముఖ్య నాయకులతో చర్చించల అనంతరం, అవనిగడ్డ నుంచి ఆయనే బలమైన అభ్యర్థిగా భావించి ఆయన పేరును ఖరారు చేశారు. మండలి బుద్దప్రసాద్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికి, అంతకు ముందు చాలాసార్లు మార్లు ఆయన ఆ నియోజవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గంలో పట్టు ఉన్న నేత కావడంతో పార్టీ ఆయన వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇకపోతే జనసేన పార్టీ టిక్కెట్ ఆశించిన వారిలో బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ వంటి వాళ్లు వున్నారు.
రైల్వే కోడూరు అభ్యర్థి మార్పు
మరో వైపు రైల్వే కోడూరు(Railway Koduru) స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మిత్ర పక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో మరోసారి అధ్యయనం చేస్తున్నారు. యనమల భాస్కర్ రావు వైసీపీ ముఖ్య నేతలకు సన్నిహితమైన వ్యక్తి అని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా ఆయనను మార్చాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రైల్వేకోడూరు అభ్యర్థి మార్పుపై నేడో, రేపో ప్రకటన రానుంది.
ఇకపోతే జనసేన పార్టీ ఖరారు చేయాల్సిన నియోజకవర్గం పాలకొండ ఒక్కటే. టీడీపీ తరపున టిక్కెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీలో చేరారు. ఇక్కడ ఆయనే బలమైన అభ్యర్థి అవుతారన్న అంచనాలు ఉన్నాయి. అయితే అంతర్గతంగా సర్వేలు నిర్వహించిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.
అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా శ్రీ మండలి బుద్ధ ప్రసాద్#VoteForGlass pic.twitter.com/5zGc4kndba
— JanaSena Party (@JanaSenaParty) April 4, 2024